భారత్‌కు అమెరికా ఆఫర్‌

US Offers Advanced System To India - Sakshi

ఈఎంఏఎల్‌ఎస్ టెక్నాలజీ ఇచ్చేందుకు సుముఖత

త్వరలోనే భారత్‌కు ఆధునిక టెక్నాలజీ

నౌకాదళం మరింత బలోపేతం

వాషింగ్టన్‌ : భారత నౌకా దళం భవిష్యత్‌లో మరింత శక్తి వంతం కాబోతోంది. ఇప్పటికే అమెరికా- భారత్‌ మధ్య పలు కీలక రక్షణ ఒప్పందాలు కుదిరాయి. ఈ నేపథ్యంలోనే భారత నౌకా దళానికి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని అందించేందుకు అమెరికా అంగీకరించింది. ఈ టెక్నాలజీ వల్ల భారీ యుద్ధ విమానాలు సైతం తక్కువ రన్‌ వేలో సురక్షితంగా ల్యాండ్‌ అవుతాయి. ఎలక్ట్రో మాగ్నటిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లాంచ్‌ సిస్టమ్‌ (ఈఎంఏఎల్‌ఎస్‌)గా పేర్కొనే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత నౌకాదళానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది.ఎలక్ట్రో మాగ్నటిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లాంచ్‌ సిస్టమ్‌ ఖరీదు తక్కువ కావడంతో పాటు నౌక మీద తేలికగా ఉంటుందని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి రెక్స్‌ టెల్లిర్‌సన్‌ భారత పర్యటనలో ఈ టెక్నాలజీపై ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందని ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది. ఈ టెక్నాలజీని భారత్‌కు అందించేందుకు అమెరికా సానుకూలంగా ఉందని, ఈ విషయాన్ని ఇప్పటికే భారత అధికారులకు తెలిపామని ట్రంప్‌ కార్యాలయం తెలిపింది. ఎలక్ట్రో మాగ్నటిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లాంచ్‌ సిస్టమ్‌పై ఆసక్తిని ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నపుడు భారత్‌ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. దీనిపై ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ తమ అభిప్రాయన్ని ఇప్పుడు తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top