చైనా విమానాలపై అమెరికా నిషేధం | US to ban passenger flights from China | Sakshi
Sakshi News home page

చైనా విమానాలపై అమెరికా నిషేధం

Jun 4 2020 4:33 AM | Updated on Jun 4 2020 5:12 AM

US to ban passenger flights from China - Sakshi

చైనాకు చెందిన ఎయిర్‌ చైనా, చైనా ఈస్ట్రర్స్‌ ఎయిర్‌లైన్స్, చైనా సదరన్‌ ఎయిర్‌లైన్స్, జియామెన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు తమ దేశంలో కార్యకలాపాలు సాగించకుండా ట్రంప్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. జూన్‌ 16వ తేదీ నుంచి సదరు సంస్థల విమానాలు అమెరికాలోకి రావడానికి, అమెరికా నుంచి వెళ్లడానికి వీళ్లేదని రవాణా విభాగం స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో నిలిపివేసిన అమెరికాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానాలను పునఃప్రారంభించే విషయంలో చైనా విఫలం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement