సాంస్కృతిక కట్టడాలను కాపాడాలి: యునెస్కో | US and Iran must protect cultural sites | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక కట్టడాలను కాపాడాలి: యునెస్కో

Jan 7 2020 6:09 AM | Updated on Jan 7 2020 6:09 AM

US and Iran must protect cultural sites - Sakshi

పారిస్‌: అమెరికా–ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం అలుముకున్న తరుణంలో ఇరుదేశాలకు యునెస్కో కీలక సూచన చేసింది. దేశాల్లోని చారిత్రాత్మక, సాంస్కృతిక కట్టడాలను ఇరు దేశాలు పరిరక్షించాలని కోరింది. ఈ మేరకు యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఆడ్రే అజౌల్‌ ఇరాన్‌ దౌత్యవేత్తతో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. ఇరాన్, అమెరికాలు 1972లో సంతకం చేసిన ఒప్పందం ప్రకారం సాంస్కృతిక కట్టడాలకు ఎటువంటి నష్టం చేకూర్చకుండా ఉండాలని చెప్పారు. అమెరికా బలగాలపై దాడులు చేస్తే ఇరాన్‌లోని నిర్దిష్ట ప్రాంతాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement