ఉగ్రవాద కార్యకలాపాలకు దిగి తమ దేశాల్లో పెను విధ్వంసానికి పాల్పడేందుకు కుట్రలు చేశారని ఆరోపణల కిందట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఉన్నత న్యాయస్థానం పదకొండుమందికి జీవిత ఖైదు విధించింది.
అబుదాబి: ఉగ్రవాద కార్యకలాపాలకు దిగి తమ దేశాల్లో పెను విధ్వంసానికి పాల్పడేందుకు కుట్రలు చేశారని ఆరోపణల కిందట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఉన్నత న్యాయస్థానం పదకొండుమందికి జీవిత ఖైదు విధించింది.
మరో ఇద్దరికి 15 ఏళ్లు, మరో 13 మందికి పదేళ్లు, ఆరుగురుకి మూడేళ్లు, ఇద్దరికి ఐదేళ్లు శిక్షలు ఖరారు చేసింది. ఈ విషయాన్ని అరబ్ మీడియా ఒకటి స్పష్టం చేసింది. మరో ఏడుగురిని మాత్రం నిర్దోషులుగా ప్రకటిస్తూ విడిచిపెట్టింది.


