ఇస్లామోఫోబియా పోగొట్టేందుకు టీవీ చానల్‌

TV Channel For Reduced Islamophobia - Sakshi

ఇస్లామాబాద్‌: పశ్చిమదేశాల్లో ముస్లింలకు సంబంధించిన అంశాలతోపాటు ఇస్లాం అంటే ఉన్న భయాన్ని పోగొట్టేందుకు పాకిస్తాన్, మలేసియా, టర్కీ కలిసి బీబీసీ తరహా ప్రత్యేక టీవీ చానల్‌ను ప్రారంభించనున్నాయి. ఇటీవలి ఐరాస సమావేశాల్లో ప్రసంగించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఈ విషయం ప్రకటించడం తెల్సిందే. ఇంగ్లిష్‌లో ప్రసారమయ్యే టీవీ చానెల్‌తోపాటు సంయుక్తంగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుపై చర్చలు జరుగుతున్నా.. చానల్‌ను ఎప్పుడు ప్రారంభించేదీ ఇంకా నిర్ణయించలేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top