'ట్రంప్ మోడల్స్' మూత పడింది! | Trump’s modeling agency shuts down | Sakshi
Sakshi News home page

'ట్రంప్ మోడల్స్' మూత పడింది!

Apr 11 2017 3:53 PM | Updated on Aug 25 2018 7:52 PM

'ట్రంప్ మోడల్స్' మూత పడింది! - Sakshi

'ట్రంప్ మోడల్స్' మూత పడింది!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబానికి చెందిన మోడలింగ్‌ ఏజెన్సీ 'ట్రంప్‌ మోడల్స్‌' మూత పడింది.

లాస్‌ ఏంజిల్స్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబానికి చెందిన మోడలింగ్‌ ఏజెన్సీ 'ట్రంప్‌ మోడల్స్‌' మూత పడింది. ఈ విషయాన్ని ఏజెన్సీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. 1999లో మొదలైన ట్రంప్ మోడల్స్ నుంచి కెరీర్ ప్రారంభించిన పలువురు మోడల్స్ ఉన్నత స్ధాయికి చేరుకున్నారు.

ఉన్నట్లుండి ఏజెన్సీ మూసివేతకు స్ధాయికి తగిన ప్రాజెక్టులు రాకపోవడమే కారణమని తెలుస్తోంది. ఇటీవల ట్రంప్ మోడల్స్ లో పనిచేసే మేనేజర్ ఒకరు సంస్ధ నుంచి బయటకు వెళ్లి కొత్తగా ఏజెన్సీ ప్రారంభించినట్లు ఓ మీడియా సంస్ధ పేర్కొంది. సంస్ధలో పేరున్న చాలా మంది మోడల్స్ అతని ఏజెన్సీకి వెళ్లిపోయినట్లు తెలిపింది. ట్రంప్ మోడల్స్ మూసివేతకు ఇది కూడా ఓ కారణంగా భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement