కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తా

Trump again offers to help resolve Kashmir issue - Sakshi

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌తో ట్రంప్‌

మధ్యవర్తిత్వం అంగీకరించబోం: భారత్‌

దావోస్‌: కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కి సాయపడతానంటూ మరోమారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కశ్మీర్‌ వివాదాన్ని పరిష్కరించేందుకు.. అవసరమైతే బాసటగా ఉంటానంటూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సమావేశంలో ట్రంప్‌ బుధవారం తెలిపారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న ట్రంప్‌.. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌తో వేరుగా సమావేశం అయ్యారు. కశ్మీర్‌ వివాదంపై భారత ప్రధాని మోదీతో మాట్లాడతానని ఇమ్రాన్‌కు హామీ ఇచ్చారు. 

కాగా, కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘కశ్మీర్‌ అంశం భారత్‌–పాక్‌కు సంబంధించింది. దీంట్లో ఎవ్వరి ప్రమేయాన్ని అంగీకరించే ప్రశ్నే లేదు’ అని పేర్కొంది. పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ని కలుసుకోవడం తనకు చాలా ఇష్టమనీ, అయితే ఆమె తన కోపాన్ని అమెరికాపై ప్రదర్శించవద్దంటూ ట్రంప్‌ సూచించారు. అనేక దేశాలు అమెరికా కంటే  ఎక్కువ కాలుష్యంతో నిండిఉన్నాయనీ గ్రెటా ఆ ప్రాంతాలపై దృష్టిసారించడం మంచిదని హితవు పలికారు.  ట్రంప్‌ ఉపన్యాసాన్ని ప్రశాంతంగా కూర్చుని విన్న గ్రెటా ‘‘మా ఇళ్లు ఇంకా మంటల్లో కాలుతున్నాయి’’ అని వ్యాఖ్యానించింది.  
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top