అమెరికాలో పులికీ కరోనా!

Tiger tests positive for coronavirus at Bronx Zoo - Sakshi

న్యూయార్క్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ ఇప్పుడు జంతువులకూ సోకడం మొదలైంది. పిల్లి జాతి జంతువుల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశించే అవకాశముందని శాస్త్రవేత్తలు నిర్ధారించిన నేపథ్యంలో న్యూయార్క్‌లోని బ్రాంక్జ్‌ జంతు ప్రదర్శన శాలలో నాదియా అనే నాలుగేళ్ల పులి ఈ వైరస్‌ బారిన పడింది.  గత ఏడాది డిసెంబరులో చైనాలోని వూహాన్‌లో ముందుగా కనిపించిన కరోనా వైరస్‌ జంతువుల నుంచి మనుషుల్లోకి  ప్రవేశించిందని అంచనా. హాంకాంగ్‌లో ఇప్పటికే రెండు కుక్కలకు ఈ వ్యాధి సోకినట్లు సమాచారం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top