ఫ్రాన్స్లో రౌడీల వీర విహారం | Three dead in suspected gang shooting in France: source | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్లో రౌడీల వీర విహారం

Apr 3 2016 9:00 AM | Updated on Sep 3 2017 9:08 PM

ఫ్రాన్స్లో రౌడీల వీర విహారం

ఫ్రాన్స్లో రౌడీల వీర విహారం

ఫ్రాన్స్లో అనుమానిత గూంఢాలు తెగబడ్డారు. కాల్పులు జరిపి ముగ్గురు ప్రాణాలు బలితీసుకున్నారు.

మర్సెల్లీ: ఫ్రాన్స్లో అనుమానిత గూంఢాలు తెగబడ్డారు. కాల్పులు జరిపి ముగ్గురు ప్రాణాలు బలితీసుకున్నారు. దీంతో రౌడీల కాల్పుల కారణంగా చనిపోయినవారి సంఖ్య ఈ కొత్త సంవత్సరంలో ఎనిమిదికి చేరినట్లు పోలీసు అధికారులు చెప్పారు. మరో ముగ్గురు కూడా గాయాలపాలయినట్లు చెప్పారు.

అధికారుల సమాచారం ప్రకారం మర్సెల్లీలో రాత్రి 10.30గంటల ప్రాంతంలో ఓ నాలుగంతస్తుల భవంతిలోకి చొరబడిన అనుమానిత గూంఢాలు ఆ వెంటనే కాల్పులు జరిపి పారిపోయారు. గత ఏడాదిలో కూడా ఇదే మర్సెల్లీలో 19 మంది, 2014లో 18మంది, 2013లో 17 మంది అనుమానిత గ్యాంగ్ స్టర్ల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు విడిచారు.

Advertisement
 
Advertisement
Advertisement