ఈతే అతని ప్రయాణ మార్గం.. | This is his way of traveling | Sakshi
Sakshi News home page

ఈతే అతని ప్రయాణ మార్గం..

Jul 30 2017 1:21 AM | Updated on Sep 5 2017 5:10 PM

ఈతే అతని ప్రయాణ మార్గం..

ఈతే అతని ప్రయాణ మార్గం..

జర్మనీలోని మ్యూనిచ్‌లో ఉండే విపరీతమైన ట్రాఫిక్‌ జామ్‌ల వల్ల సమయానికి ఆఫీసులకు, స్కూళ్లకు చేరుకోవడానికి అక్కడివారు ఎంతో ఆపసోపాలు పడుతున్నారు.

జర్మనీలోని మ్యూనిచ్‌లో ఉండే విపరీతమైన ట్రాఫిక్‌ జామ్‌ల వల్ల సమయానికి ఆఫీసులకు, స్కూళ్లకు చేరుకోవడానికి అక్కడివారు ఎంతో ఆపసోపాలు పడుతున్నారు. గంటలు గంటలు ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుని అల్లాడిపోతున్నారు. కానీ ఈ కష్టాలన్నిం టినీ ఈది పారేస్తున్నాడు 40 ఏళ్ల బెంజమిన్‌ డేవిడ్‌. రోజూ ఆ పట్టణం నడిబొడ్డున ప్రవహిస్తున్న ఇసార్‌ నదిలో ఈదుకుంటూ బెంజమిన్‌ ఆఫీసుకు చేరుకుంటున్నాడు. దశాబ్దాలుగా ఈ నదిని ప్రయాణం నిమిత్తం ఎవరూ ఉపయోగించలేదు. కానీ రెండేళ్లుగా బెంజమిన్‌ మాత్రం తన ప్రయాణ మార్గంగా వినియోగిస్తున్నాడు.

ఈ ప్రయాణ మార్గం ద్వారా అతను కేవలం అర్ధగంటలోనే రెండు కిలోమీటర్ల దూరంలోని కుల్టర్‌స్ట్రాండ్‌లో ఉన్న తన ఆఫీసుకు చేరుకుంటున్నాడు. ఒక చక్కని బ్యాగులో తడవకుం డా బట్టలు పెట్టుకుని ఈత కొట్టుకుంటూ వెళ్లిపోతున్నాడు. గమ్యానికి చేరుకోగానే బ్యాగులోని బట్టలు తీసి ఎంచక్కా ఆఫీసుకు వెళ్లిపోవడం అతని దినచర్య. అయితే నదిలో ఈత కొట్టడం ఎంతో ప్రమాదకరం. కాబట్టి ప్రతి రోజూ ఉద్యోగానికి వెళ్లే ముందు ఆన్‌లైన్‌ నీటి స్థాయి, ఉష్ణోగ్రత, పీడనం ఎంతుందో గమనించి వెళుతుంటాడు. అన్నీ సేఫ్‌ లెవెల్లో ఉంటేనే ఈతకు సిద్ధపడతాడు. ఒకవేళ ఆ రోజు ఈత కొట్టడం మంచిది కాదని భావిస్తే మాత్రం సాధారణ ప్రయాణ మార్గాన్ని ఆశ్రయిస్తాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement