
వాషింగ్టన్ : ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే విషయాన్ని నాసా ప్రకటించింది. విశాల చీకటి అంతరిక్షంలో మనషికి తెలియని అతీత శక్తులు.. వాటి ధ్వనులను గుర్తించినట్టు వెల్లడించింది. శాటిలైట్ల ప్రయాణంలో రికార్డు చేయబడిన ధ్వనులను నాసా తాజాగా విడుదల చేసింది. నాసా విడుదల చేసిన ఆడియో టేపుల్లో అతీతశక్తుల ధ్వనులను స్పష్టంగా వినవచ్చును.
అంతరిక్షంలోని అతీంద్రియం లోకం నుంచి విచిత్ర ధ్వనులు, సంకేతాలు అందుతున్నట్లు నాసా తెలిపింది. ఈ ధ్వని తరంగాల్లో రేడియో, ప్లాస్మా, మ్యాగ్నటిక్ వేవ్స్‌ను ఆడియో టేపుల్లోకి నాసా అధికారులు మార్చారు. ఆడియోటేపుల్లో కొన్ని శబ్దాలు అత్యంత భయానకంగా ఉంటే మరికొన్ని ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. భూమికి ఆవల రికార్డు చేసిన 22 ఆడియో టేపులను నాసా విడుదల చేసింది.