'అమ్మాయిల్లో పిచ్చి ఫాలోయింగ్' | The 'handsome gorilla' driving Japanese girls mad | Sakshi
Sakshi News home page

'అమ్మాయిల్లో పిచ్చి ఫాలోయింగ్'

Jun 27 2015 10:27 AM | Updated on Sep 3 2017 4:28 AM

ఈ మాట అంటున్నది ఎవరో కాదండోయ్. 180 కేజీల బరువుతో కండలు మెలితిరిగి బలిష్టంగా ఉన్న ఈ గొరిల్లాను చూసి జూకు వచ్చిన అమ్మాయిలంటున్నారు.

ఈ మాట అంటున్నది ఎవరో కాదండోయ్. 180 కేజీల బరువుతో కండలు మెలితిరిగి బలిష్టంగా ఉన్న ఈ గొరిల్లాను చూసి జూకు వచ్చిన అమ్మాయిలంటున్నారు. 18 ఏళ్ల వయసున్న ఈ మగ గొరిల్లా పేరు షబని. నెదర్లాండ్లో పుట్టిన ఈ గొరిల్లాను ఆస్ట్రేలియాకు, అనంతరం జపాన్లోని నగోయా సిటీ హిగషియామా జూకు తరలించారు. 2007 నుంచి ఇక్కడే ఉంటున్న దీనితో జూ నిర్వహకులు ఓ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పట్నుంచి దీనికి అమ్మాయిల్లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీనిని చూసేందుకు పెద్దసంఖ్యలో యువతులు జూకు తరలి వస్తున్నారని జూ అధికారి తెలిపారు. ట్విటర్లోనూ షబనీకి తెగ ఫాలోయింగ్ ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement