పుతిన్.. ద క్యాలెండర్ బాయ్ | The Calendar Boy | Sakshi
Sakshi News home page

పుతిన్.. ద క్యాలెండర్ బాయ్

Oct 24 2016 12:47 AM | Updated on Sep 4 2017 6:06 PM

పుతిన్.. ద క్యాలెండర్ బాయ్

పుతిన్.. ద క్యాలెండర్ బాయ్

కింగ్‌ఫిషర్ క్యాలెండర్ తెలుసు..! ప్లేబాయ్ క్యాలెండర్ తెలుసు..!! మరి పుతిన్ క్యాలెండర్ తెలుసా?

కింగ్‌ఫిషర్ క్యాలెండర్ తెలుసు..! ప్లేబాయ్ క్యాలెండర్ తెలుసు..!! మరి పుతిన్ క్యాలెండర్ తెలుసా? ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరిట రూపొందిన క్యాలెండర్. ప్రస్తుతం రష్యాలో పుతిన్ క్యాలెండర్ ఓ సెన్సేషనల్ ట్రెండ్. 2017 సంవత్సరానికిగానూ పుతిన్ క్యాలెండర్ అప్పుడే మార్కెట్‌లోకి వచ్చేసింది. దీనిని పుతినే అధికారికంగా విడుదల చేస్తుండటం గమనార్హం. క్రిస్మస్ సందర్భంగా రష్యాలోని షాపులు, మాల్స్ ఈ క్యాలెండర్‌ను అమ్మేందుకు  రెడీ అయిపోయాయి.

ఈ క్యాలెండర్ పూర్తిగా పుతిన్ స్పెషల్. మొత్తం 12 పేజీల్లోనూ వెరైటీ స్టిల్స్‌తో రష్యా అధ్యక్షుడు దర్శనమిస్తారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ మాదిరిగా టాప్‌లెస్‌గా గుర్రపు స్వారీ చేస్తూ.. సైబీరియాలో చేపలు పడుతూ.. తనలోని కొత్త యాంగిల్స్‌తో పుతిన్ ఈ క్యాలెండర్‌లో కనిపిస్తారు. ఫ్లైట్ నడుపుతూ.. స్కైడైవింగ్ చేస్తూ.. మార్షల్ ఆర్ట్స్ చేస్తూ.. కుక్క పిల్లలతో ఆడుకుంటూ సరదాగా గడిపిన చిత్రాలు కూడా ఉన్నాయి. వీటిని కొనేందుకు రష్యన్లు అమితాసక్తి చూపిస్తున్నారు. రష్యాలోనే కాదు జపాన్ తదితర దేశాల్లోనూ ఈ క్యాలెండర్‌కు చాలా క్రేజ్ ఉంది. అంటే రష్యన్లు ఉదయం నిద్ర లేవగానే పుతిన్ ఫొటోను చూసి రోజును ప్రారంభిస్తారన్నమాట.

Advertisement
 
Advertisement
Advertisement