ఇండోనేసియాలో భూకంపం | Strong earthquake hits eastern Indonesia; no tsunami threat | Sakshi
Sakshi News home page

ఇండోనేసియాలో భూకంపం

Nov 4 2015 1:25 PM | Updated on Sep 3 2017 12:00 PM

ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో బుధవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.3గా నమోదు అయిందని ఇండోనేసియా ఉన్నతాధికారి వెల్లడించారు.

జకార్తా : ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో బుధవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.3గా నమోదు అయిందని ఇండోనేసియా ఉన్నతాధికారి వెల్లడించారు. భూకంపం సంభవించగానే నివాసాల నుంచి ప్రజుల బయటకు పరుగులు తీశారని చెప్పారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కానీ సంభవించినట్లు సమాచారం ఇప్పటి వరకు అందలేదని చెప్పారు. అలోర్ ద్వీపంలోని తూర్పు నుష్టంగ్గర్ ప్రావిన్స్లోని భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వివరించింది. సునామీ వచ్చే అవకాశాలు కూడా లేవని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement