కోల్డ్‌ బ్లాస్ట్‌...మంచుసునామీ | Sakshi
Sakshi News home page

కోల్డ్‌ బ్లాస్ట్‌...మంచుసునామీ

Published Sun, Nov 3 2019 1:14 AM

Special Story On Snow Tsunami - Sakshi

సునామీ సృష్టించే విధ్వంసాన్ని మనమెరుగుదుం. కానీ చల్లటి మంచు కూడా సునామీని సృష్టించగలదని ఊహించలేం. ఉన్నట్టుండి తెల్లటి మంచుకొండ మనఇళ్లను తొలుచుకొని లోపలికి చొచ్చుకొస్తుంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులే మంచు సునామీకి కారణం. గుట్టలుగా కొట్టుకొచ్చే ఈ మంచు మరో మంచుపర్వతాన్ని తలపించేలా కుప్పగా పడుతుంది. ఈ మంచుతుపానుని మించిన మంచు సునామీ ఇళ్లనూ, ఊళ్లనూ కమ్మేస్తుంది. మంచు సునామీ ఎత్తు 30 అడుగులకి మించి కూడా ఉంటుంది. సాధారణంగా శీతాకాలంలో ధృవప్రాంతాల్లో ఈ మంచు సునామీలు వస్తుంటాయి. మంచు సునామీలను 1822లోనే గుర్తించారు. మంచు సునామీలనే ‘‘ఐస్‌ షక్షవ్స్‌’’, ఇవూ అని కూడా పిలుస్తారు. దాదాపు గంటకు 74 మైళ్ల వేగంతో ఈ మంచు సునామీ వస్తుంది. ఇటీవల నార్త్‌ అమెరికా, కెనడాల్లో మంచు సునామీ కారణంగా తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఎరీ సరస్సు, ఓంటారియో సరస్సుల్లో వచ్చిన మంచు సునామీ కారణంగా ఇళ్లు కొట్టుకుపోయాయి. 30 అడుగుల ఎత్తువరకు మంచు వరసగా గోడకట్టినట్టు కుప్పలుగాపడిపోయింది. న్యూయార్క్‌ స్టేట్‌లోని హూవర్‌ బీచ్‌లో వచ్చిన మంచు సునామీ ఆ ప్రాంతంలోని ప్రజల ఇళ్లను, ఆస్తులను ధ్వంసం చేసింది.

Advertisement
Advertisement