దాతృత్వం చాటుకున్న బిజినేస్‌ మ్యాన్‌

Singapore Businessman Cook Biryani For 600 Migrants On Eid - Sakshi

సింగపూర్‌: ప్రపంచవవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు నేడు రంజాన్‌ పండుగ జరుపుకుంటున్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల ఈ ఏడాది పండగ సంబరాలు ఎక్కడా కనిపించడం లేదు. లాక్‌డౌన్‌, సామాజిక దూరం నేపథ్యంలో ఎవరి ఇళ్లలో వారే పండగ జరుపుకుంటున్నారు. ఇళ్లలో ఉన్న వారి పరిస్థితి పర్లేదు.. మరి క్వారంటైన్‌లో ఉండే వారి సంగతి ఎలా. అక్కడ వారు పెట్టింది తినాలే తప్ప వేరే మార్గం లేదు. ఈ నేపథ్యంలో సింగపూర్‌కు చెందిన ఓ బిజినేస్‌ మ్యాన్‌ క్వారంటైన్‌లో ఉన్న వారికి బిర్యానీ విందు ఇచ్చి.. పండగ పూట వారికి తోడుగా నిలబడ్డాడు. దుష్యంత్‌ కుమార్‌ అనే వ్యక్తి దాదాపు 600 మంది వలస కూలీలకు బిర్యానీతో విందు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు.(నిర్మానుష్యంగా మారిన ఈద్గాలు,మసీదులు

ఈ సందర్భంగా దుష్యంత్‌ మాటట్లాడడుతూ.. ‘భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, చైనా  దేశాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు. సాధారణంగా అయితే పండగ సమయానికి వారు కుటుంబ సభ్యులతో ఇంట్లో సంతోషంగా ఉండేవారు. కానీ ఈ సారి ఆ అవకాశం లేకుండా పోయింది. కరోనా వైరస్‌ వల్ల ఈ వలస కూలీలంతా ఇక్కడే క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండిపోయారు. పండగ పూట వారి ముఖంలో నవ్వు చూడాలనుకున్నాను. అందుకే నా భార్యతో కలిసి ఓ పెద్ద రెస్టారెంట్‌ కిచెన్‌లో దాదాపు 600 మంది​కి సరిపోను బిర్యానీ వండించాను’ అని తెలిపాడు. ఇదే కాక లాక్‌డౌన్‌ ప్రారంభం అయిన నాటి నుంచి ప్రతిరోజు 1000 మందికి భోజనం పెడుతు మంచి మనసు చాటుకుంటున్నాడు దుష్యంత్‌.(గోల్డీ కల్యాణం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top