డిన్నర్‌ కోసం మూత తీస్తే.. కోలుకోలేని షాక్‌ | Russian Woman found a birds head inside Corn Box | Sakshi
Sakshi News home page

డిన్నర్‌ కోసం మూత తీస్తే.. కోలుకోలేని షాక్‌

Sep 17 2017 11:27 AM | Updated on Sep 19 2017 4:41 PM

డిన్నర్‌ కోసం మూత తీస్తే.. కోలుకోలేని షాక్‌

డిన్నర్‌ కోసం మూత తీస్తే.. కోలుకోలేని షాక్‌

బాగా ఆకలితో ఉన్న ఆ మహిళ డిన్నర్‌ సిద్ధం చేసుకునేందుకు మొక్కజొన్న పొత్తుల డబ్బాను...

సాక్షి, మాస్కో: రష్యాకు చెందిన ఓ యువతి సోషల్‌ మీడియా అకౌంట్‌లో భయానక పోస్టు దర్శనమిస్తోంది. రాత్రిపూట భోజనానికి సిద్ధమైన ఆమె తాను చూసిన దిగ్భ్రాంతికి దృశ్యాన్ని చూపిస్తూ.. అందరూ జాగ్రత్తగా.. ఉండాలంటూ ఓ ఫోటోను షేర్‌ చేసింది. 
 
బెల్‌గ్రోడాకు రీజియన్‌కు చెందిన మహిళ గురువారం సాయంత్రం డిన్నర్‌ తయారు చేసుకునేందుకు సిద్ధమైంది. అంతకు ముందే షాపు నుంచి తెచ్చిన ఓ మొక్కజోన్న పొత్తుల డబ్బాను తెరిచింది. అందులో ఓ పక్షి తల ఉండటంతో షాక్‌ కి గురైన మహిళ.. మిగతా డబ్బాలను తెరవకుండానే అలాగే ఉండిపోయింది. వెంటనే ఆ విషయాన్ని ఆమె తన ‘పీకబూ’ ఖాతాలో తెలియజేసింది. ఒకవేళ పక్షి తల అడుగుభాగన ఉండి ఉంటే.. అది గమనించకుండా కొన్ని పొత్తులను తినేసి ఉండేదాన్నేమో అంటూ భయం వ్యక్తం చేసింది.  
 
అయితే ఇంత చేసిన ఆ మహిళ సదరు కంపెనీపై దావా వేసే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఆ భయాన అనుభవం ఇప్పటికీ తన కళ్ల ముందు మెదులుతూనే ఉందని, ఆ షాక్‌ నుంచి తాను ఇప్పట్లో కోలుకోనేమోనని ఆమె చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement