ట్విట్టర్‌ యూజర్లకు భారీ షాక్‌ | Russian hackers sell 33 million Twitter passwords online | Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌ యూజర్లకు భారీ షాక్‌

Jun 9 2016 10:37 PM | Updated on Sep 4 2017 2:05 AM

ట్విట్టర్‌ యూజర్లకు భారీ షాక్‌

ట్విట్టర్‌ యూజర్లకు భారీ షాక్‌

మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌ను ఓ రష్యా హ్యాకర్‌ హ్యాక్‌ చేశాడు.

  • 3.3 కోట్ల యూజర్ పేర్లు, పాస్‌వర్డ్స్‌ హ్యాక్‌

  • మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌ను ఓ రష్యా హ్యాకర్‌ హ్యాక్‌ చేశాడు. ఏకంగా 3.3 కోట్ల మంది నెటిజన్ల యూజర్ నేమ్స్‌, పాస్‌వర్డ్స్‌ ను హ్యాక్‌ చేసి వాటిని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. ట్విట్టర్‌ యూజర్లలో పదిశాతం మంది ఈ హ్యాకింగ్ బారిన పడ్డారు. ఫేస్‌బుక్‌ అధిపతి మార్క్‌ జుకర్‌బర్గ్‌, ప్రముఖ సింగర్ కేటీ పెర్రీ సహా ఎంతోమంది సినీతారలు, ప్రముఖుల ఖాతాల వివరాలు హ్యాకర్‌ బట్టబయలుచేశాడు.

    దుమారం రేపుతున్న ఈ హ్యాకింగ్ వ్యవహారంపై ట్విట్టర్ స్పందించింది. తమ వెబ్‌సైట్‌ భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేవని, అయినా ఈ భారీ లీక్‌ వ్యవహారంలో ట్విట్టర్‌ ఖాతాలు ఎన్ని ఉన్నాయి.. ఈ హ్యాకింగ్ ఎలా జరిగింది అనే విషయాన్ని ఆరా తీస్తున్నట్టు తెలిపింది. మైస్పేస్‌, లింకెడ్‌ ఇన్‌ వంటి సోషల్ మీడియాల్లోని భద్రతా ఉల్లంఘనల ద్వారా సేకరించిన ఈమెయిల్‌, పాస్‌వర్డ్స్‌, యూజర్‌ నేమ్స్‌ను ఉపయోగించుకొని ట్విట్టర్‌లోనూ ఈ మేరకు హ్యాక్ చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. 2011కు ముందు హ్యాక్‌ చేసిన సోషల్ మీడియా యూజర్ల వివరాలను హ్యాకర్లు డార్క్‌ వెబ్‌సైట్లలో అమ్ముతున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement