breaking news
Russian hackers
-
లక్షల ఖాతాలను లాక్ చేసిన ట్విట్టర్
న్యూఢిల్లీ: ప్రముఖులు, సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాల హ్యాకింగ్ వ్యవహారంలో మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ముందు లీక్ వ్యవహారం లేదని వాదించిన ట్విట్టర్ ..ఈ వ్యవహారంపై ఆరా తీసింది. అనంతరం మిలియన్ల కొద్దీ ఖాతాలను లాక్ చేసినట్టు ప్రకటించింది. వినియోగదారుల భద్రత రీత్యా ఈ చర్య తీసుకున్నట్టు ట్విట్టర్ అధిపతి మైఖేల్ కోట్స్ తెలిపారు. దుమారం రేపిన ఈ హ్యాకింగ్ వ్యవహారంపై ట్విట్టర్ స్పందించిన ట్విట్టర్ ..డైరెక్ట్ పాస్వర్డ్ ఎక్స్ పోజర్ ను లాక్ చేసినట్టు వెల్లడించింది. తమ ఖాతాదారులందరూ పాస్ వర్డ్ ను రీసెట్ చేసుకోవాలని సూచించింది. మొత్తం ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతీ అంశాన్ని క్రాస్ చెక్ చేశామని సంస్థ అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో కొన్ని ఖాతాలకు మరింత భద్రత అవసరమనే విషయాన్ని గ్రహించామని తెలిపారు. యూజర్ల ఖాతాల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యకు ఉపక్రమించినట్టు తెలిపారు. అయితే ఎన్ని ఖాతాలు హ్యాక్ అయ్యాయనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. యూజర్లు పటిష్టమైన పాస్ వర్డ్స్, టు-స్టెప్ వెరిఫికేషన్ ద్వారా తమ ఖాతాలను సెక్యూర్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. యాప్ నోటిఫికేషన్స్, మెసేజ్ ల ద్వారా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. కాగా ఏకంగా 33 మిలియన్ల నెటిజన్ల యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ ను హ్యాక్ చేసిన ఓ రష్యా హ్యాకర్ హ్యాకర్ వాటిన ఆన్లైన్లో అమ్మకానికి పెట్టడం ఆందోళన రేపింది. ఫేస్బుక్ అధిపతి మార్క్ జుకర్‌బర్గ్, ప్రముఖ సింగర్ కేటీ పెర్రీ సహా ఎంతోమంది సినీతారలు, ప్రముఖుల ఖాతాల వివరాలు సహా, యూజర్లలో పదిశాతం మంది ఈ హ్యాకింగ్ బారిన పడిన సంగతి తెలిసిందే. భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేవని కొట్టిపారేసిన ట్విట్టర్.. చివరకు భద్రతా చర్యలకు ఉపక్రమించింది. -
ట్విట్టర్ యూజర్లకు భారీ షాక్
3.3 కోట్ల యూజర్ పేర్లు, పాస్వర్డ్స్ హ్యాక్ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్‌ను ఓ రష్యా హ్యాకర్ హ్యాక్ చేశాడు. ఏకంగా 3.3 కోట్ల మంది నెటిజన్ల యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ ను హ్యాక్ చేసి వాటిని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు. ట్విట్టర్ యూజర్లలో పదిశాతం మంది ఈ హ్యాకింగ్ బారిన పడ్డారు. ఫేస్బుక్ అధిపతి మార్క్ జుకర్‌బర్గ్, ప్రముఖ సింగర్ కేటీ పెర్రీ సహా ఎంతోమంది సినీతారలు, ప్రముఖుల ఖాతాల వివరాలు హ్యాకర్ బట్టబయలుచేశాడు. దుమారం రేపుతున్న ఈ హ్యాకింగ్ వ్యవహారంపై ట్విట్టర్ స్పందించింది. తమ వెబ్సైట్ భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేవని, అయినా ఈ భారీ లీక్ వ్యవహారంలో ట్విట్టర్ ఖాతాలు ఎన్ని ఉన్నాయి.. ఈ హ్యాకింగ్ ఎలా జరిగింది అనే విషయాన్ని ఆరా తీస్తున్నట్టు తెలిపింది. మైస్పేస్, లింకెడ్ ఇన్ వంటి సోషల్ మీడియాల్లోని భద్రతా ఉల్లంఘనల ద్వారా సేకరించిన ఈమెయిల్, పాస్వర్డ్స్, యూజర్ నేమ్స్‌ను ఉపయోగించుకొని ట్విట్టర్లోనూ ఈ మేరకు హ్యాక్ చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. 2011కు ముందు హ్యాక్ చేసిన సోషల్ మీడియా యూజర్ల వివరాలను హ్యాకర్లు డార్క్ వెబ్సైట్లలో అమ్ముతున్న సంగతి తెలిసిందే.