క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి; కరోనాకు వ్యాక్సిన్‌ రెడీ

Russia Says Completed Clinical Trials Of Worlds First COVID-19 Vaccine - Sakshi

మాస్కో: కరోనా వైరస్ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా వేయి కళ్లతో ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ఇటువంటి సమయంలో ప్రపంచానికి రష్యా ఒక శుభవార్తను అందించింది. సెచెనోవ్‌ మెడికల్‌ యూనివర్శిటీలో కరోనా వ్యాక్సిన్‌కు విజయవంతంగా ట్రయల్స్‌ పూర్తయ్యాయని ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ వాడిమ్‌ తారాసోవ్‌ తెలిపారు. రష్యాలోని గమాలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ ఉత్పత్తి చేసిన టీకాతో జూన్ 18 న ట్రయల్స్ ప్రారంభించారు. అందులో భాగంగానే క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్ల బృందం బుధవారం డిశ్చార్జ్‌ కానుంది. ఇక రెండో బృందం జూలై 20వ తేదీన డిశ్చార్జ్‌ అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

కాగా, ఈ రెండు బృందాలకు కూడా సెచెనోవ్‌ యూనివర్శిటీ విజయవంతంగా పరీక్షలను పూర్తి చేసినట్లు తారాసోవ్‌ చెప్పారు. కరోనా మహమ్మారి తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సెచెనోవ్‌ విశ్వవిద్యాలయం ఒక విద్యా సంస్థగా మాత్రమే కాకుండా, ఔషధాల వంటి ముఖ్యమైన సంక్లిష్టమైన ఉత్పత్తుల సృష్టిలో పాల్గొనగలిగే శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనా కేంద్రంగా కూడా పనిచేసిందని తారాసోవ్‌ తెలిపారు. 'మేము ఈ టీకాతో పనిచేశాము. ట్రయల్స్‌లో ఈ దశ యొక్క లక్ష్యం మానవ ఆరోగ్యానికి వ్యాక్సిన్ యొక్క భద్రతను పరీక్షించడం, ఇది విజయవంతంగా జరిగింది' అని సెచెనోవ్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసిటాలజీ, ట్రాపికల్, వెక్టర్-బోర్న్ డిసీజెస్ డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషెవ్ అన్నారు. చదవండి: వ్యాక్సిన్‌: ముందు వరుసలో ఆ 3 కంపెనీలు!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top