ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సహకారం తీసుకోవాలన్న...
అమెరికా సంస్థల వ్యతిరేకత
వాషింగ్టన్: ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సహకారం తీసుకోవాలన్న అమెరికా నిర్ణయానికి ఆ దేశంలోని ప్రైవేట్ స్పేస్ ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం అమెరికా ప్రైవేట్ అంతరిక్ష రంగంపై ప్రభావం చూపుతుందని, సబ్సిడీతో ఉపగ్రహాలను ప్రయోగించే ఇస్రోతో అమెరికాలోని ప్రైవేట్ సంస్థలు పోటీ పడలేవని కార్పొరేట్ సంస్థల అధినేతలు, ప్రైవేట్ స్పేస్ ఇండస్ట్రీ ప్రతినిధులు చట్టసభ సభ్యులకు సూచించారు. ఈ ఒప్పందం వల్ల సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అయ్యే అవకాశం లేదని స్పేస్ ఫౌండేషన్ సీఈవో ఇలియట్ అన్నారు.


