
శనివారం కాల్పులు జరిగిన భవంతి
ప్రశాంతతకు పెట్టింది పేరైన స్విట్జర్లాండ్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఆరుగ్వా పట్టణానికి సమీపంలోని వురెన్లింగెన్ అనే గ్రామంలో శనివారం రాత్రి 36 ఏళ్ల ఓ పోలీసు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి నలుగురి ప్రాణాలను బలిగొన్నాడు.
జెనివా: ప్రశాంతతకు పెట్టింది పేరైన స్విట్జర్లాండ్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఆరుగ్వా పట్టణానికి సమీపంలోని వురెన్లింగెన్ అనే గ్రామంలో శనివారం రాత్రి 36 ఏళ్ల ఓ పోలీసు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి నలుగురి ప్రాణాలను బలిగొన్నాడు.
అనంతరం తనను తాను కాల్చుకొని చనిపోయాడు. రెండు ఇళ్లలోకి చొరబడి అతడు ఈ దారుణానికి తెగబడ్డాడు. మొదట ఓ ఇంట్లోకి చొరబడి ముగ్గురిని కాల్చాడు. వీరిలో ఆయన సమీప బంధువులు కూడా ఉన్నారు. అనంతరం పొరుగింటికి వెళ్లి మరో వ్యక్తిని కాల్చి చంపాడు. తర్వాత తనను కాల్చుకున్నాడు.
మాసిడోనియా ఘర్షణల్లో 22 మంది మృతి
స్కోప్జీ: మాసిడోనియాలోని కుమనోవోలో శనివారం పోలీసులకు, గుర్తుతెలియని సాయుధ దుండగులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 22 మంది మృతిచెందారు. వీరిలో 8 మంది పోలీసులు, 14 మంది సాయుధ దుండగులు ఉన్నారు. మరొక పోలీసు పరిస్థితి విషమంగా ఉంది.
దేశ రాజధాని స్కోప్జీకి 40 కి.మీ. దూరంలో ఉన్న కుమనోవోలో ఆదివారం ఉదయం వరకు సాగిన ఈ ఘర్షణల్లో 37 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. దుండగులు పోలీసులపై గ్రెనేడ్లు విసిరి, ఆటోమేటిక్ తుపాకులతో కాల్పులు జరిపారు. దుండగులు పొరుగుదేశమైన కొసావో నుంచి వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.