స్కూటర్ డిక్కీలో ఆరున్నర కోట్ల బంగారం | Police arrests one with 15 kg gold | Sakshi
Sakshi News home page

స్కూటర్ డిక్కీలో ఆరున్నర కోట్ల బంగారం

Dec 7 2014 3:13 AM | Updated on Oct 20 2018 6:40 PM

స్కూటర్ డిక్కీలో ఆరున్నర కోట్ల బంగారం - Sakshi

స్కూటర్ డిక్కీలో ఆరున్నర కోట్ల బంగారం

స్కూటర్లో భారీగా బంగారపు బిస్కెట్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శనివారం ఖాట్మాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఖాట్మాండ్: స్కూటర్లో భారీగా బంగారపు బిస్కెట్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శనివారం ఖాట్మాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 15 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసుస్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఇటీవల కాలంలో ఖాట్మాండ్ పరిసర ప్రాంతాల్లో బంగారం అక్రమ రవాణ అధికమైంది.

ఈ నేపథ్యంలో  పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా శనివారం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. దీంతో స్కూటర్ డిక్కీలో భారీగా బంగారపు బిస్కెట్లు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారపు బిస్కెట్ల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 60 లక్షల ఉంటుందని పోలీసులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement