సిడ్నీ నదిలో కూలిన విమానం  | plane crashed into the sydney river | Sakshi
Sakshi News home page

సిడ్నీ నదిలో కూలిన విమానం 

Dec 31 2017 9:58 PM | Updated on Dec 31 2017 9:58 PM

plane crashed into the sydney river - Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియాలో విమానం కూలిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర సిడ్నీకి 50 కిలోమీటర్ల దూరంలోగల  హక్సిబరీ నదిలో ఆదివారం విమానం కూలింది. సింగిల్‌ ఇంజిన్‌తో నడిచే ఎయిర్‌ క్రాఫ్ట్‌  43 అడుగుల ఎత్తు నుంచి  నదిలో కూలిపోయిందని యాక్టింగ్‌ సూపరింటెండెంట్‌ మైగోర్‌మెన్‌ వెల్లడించారు. మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. మిగతా వారికోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయన్నారు. విమానం ఎందుకు కూలిందనేది తెలియాల్సి ఉందన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement