అధ్యక్షుడే లక్ష్యంగా బాంబు దాడి | Philippines 7 PSG members, 2 troops wounded in explosion | Sakshi
Sakshi News home page

అధ్యక్షుడే లక్ష్యంగా బాంబు దాడి

Nov 29 2016 12:19 PM | Updated on Sep 4 2017 9:27 PM

అధ్యక్షుడే లక్ష్యంగా బాంబు దాడి

అధ్యక్షుడే లక్ష్యంగా బాంబు దాడి

పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టేకు పెను ప్రమాదం తప్పింది. ఆయనను లక్ష్యంగా దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు.

లానోవో డెల్‌ సుర్‌: పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టేకు పెను ప్రమాదం తప్పింది. ఆయనను లక్ష్యంగా దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. గుర్తు తెలియని దుండగులు ఐఈడీ (ఇంప్రూవైస్డ్‌ ఎక్స్ప్లోజివ్‌ డివైస్‌)ను పేల్చారు. దీని ధాటికి అధ్యక్షుడి రక్షణ బాధ్యతలు చూసే సిబ్బంది(పీఎస్‌జీ)లో ఏడుగురు, ప్రత్యేక ఆర్మీ బలగంలోని ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మారావి నగరంలో ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.

మిలిటరీ అధికార ప్రతినిధి మేజర్‌ ఫైల్‌ మాన్‌ టాన్‌ ఈ ఘటనను ధృవీకరించారు. మానావి నగరం మీదుగా అధ్యక్షుడి కాన్వాయ్‌ వెళ్లే సమయంలో అధ్యక్షుడి ముందు వెళుతున్న ప్రత్యేక భద్రతా సిబ్బంది ఈ బాంబు దాడి బారిన పడ్డారు. మొత్తం 50 మంది వివిధ రకాల ప్రత్యేక సిబ్బంది అధ్యక్షుడి కాన్వాయ్‌ ముందు వెళుతుంటుంది. వీరి వెనుక పత్రికా సిబ్బంది, ఆర్మీ సిబ్బంది ఉంటారు. మౌతే గ్రూప్‌ అనే ఓ ఇస్లామిస్ట్ టెర్రరిస్టు గ్రూప్‌ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement