తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటు ప్రాంతాలకు.. స్వతంత్ర హోదాకు రష్యా నిర్ణయం!

Russia President Putin recognises separatist eastern Ukrainian regions - Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగే ఆలోచన లేదంటూనే సంక్షోభాన్ని మరింత పెంచే చర్యలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దిగుతున్నారు. తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాదుల అదీనంలోని రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని ఆయన నిర్ణయించారు. సోమవారం తన నేతృత్వంలోని ప్రెసిడెన్షియల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ను సమావేశపరిచి ఈ విషయమై లోతుగా చర్చించారు. తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దీనిపై మాట్లాడారు.

దీనిపై ఉక్రెయిన్‌ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఐరాస భద్రతా మండలిని తక్షణం సమావేశపరిచి రష్యా దూకుడుపై చర్చించాలని కోరింది.  ఆ రెండు వేర్పాటువాద ప్రాంతాల్లో రష్యా అనుకూల రెబల్స్‌ ప్రభుత్వాలు నడుపుతున్నాయి. తమను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని, ఉక్రెయిన్‌ ఆక్రమణల బారినుంచి కాపాడి అన్నివిధాలా ఆదుకోవాలని రెబెల్స్‌ తాజాగా రష్యాను కోరారు. రష్యా పార్లమెంటు దిగువ సభ కూడా గత వారం పుతిన్‌కు ఆ మేరకు విజ్ఞప్తి చేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top