కాలుష్య కాసారంగా ప్రముఖ పర్యాటక ప్రదేశం

People Fall Ill After Swimming Monte Neme Lake in Spain - Sakshi

మాడ్రిడ్‌: ఇన్‌స్టాగ్రామ్‌ వచ్చాక స్పెయిన్‌లోని ‘మోంటే నేమ్’ సరస్సు టూరిస్ట్‌ స్పాట్‌గా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ఎందరో పర్యాటకులు ఈ సరస్సును సందర్శిస్తుంటారు. అయితే గత కొద్ది కాలంగా ఈ సరస్సుకు సంబంధించి రకరకాల వార్తలు వెలుగు చూస్తూ.. పర్యాటకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. విషయం ఏంటంటే.. ఈ సరస్సులో స్నానం చేసిన వారంతా అనారోగ్యం పాలవుతున్నారట. గత వారం ఈ సరస్సులో స్నానం చేసిన ఇద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. మరి కొద్ది మంది చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.

దీని గురించి ఓ పర్యాటకురాలు మాట్లాడుతూ.. ‘ఈ నీటిలో దిగగానే నాకు వాంతికి వచ్చిన భావన కల్గింది. అలానే నా ఒంటి మీద రాష్‌ కూడా వచ్చింది’ అని వెల్లడించారు. సరస్సుపై ఇలాంటి ఫిర్యాదులు ఎక్కవ కావడంతో నిపుణల బృందం రంగంలోకి దిగింది. చివరగా ఆసిక్తకర విషయాలు వెల్లడించింది. వారు చెప్పిన దాని ప్రకారం మోంటే నేమ్‌ అనేది సరస్సు కాదు.. గతంలో ఓ క్వారీ. టంగస్టన్‌ గనికి అనుబంధంగా దీన్ని తవ్వారు. ఆ తర్వాత దీన్ని వినియోగించడం మానేశారు. దాంతో అది కాస్త సరస్సులా మారింది. ఇంతకు ముందు ఆ ప్రాంతంలో వెలువడిన రసాయనాల వల్ల సరస్సు నీటి రంగు ప్రస్తుతం ఉన్న విధంగా మారింది. ఇక్కడ కాలుష్యం ఎంతలా ఉండేదంటే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ‘గెలీషియన్‌ చెర్నోబిల్‌’గా పిలిచేవారు అని తెలిపింది నిపుణుల బృందం.
 

అయితే ఈ సరస్సు చుట్టూ ఉన్న అందమైన నేపథ్యం ఇది పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ప్రాంతానికి చెందిన ఫోటోలను పోస్ట్‌ చేయడంతో మరింత క్రేజ్‌ సంపాదించుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top