పార్టీలోకి దూసుకెళ్లిన కారు..23మంది బలి | party goers killed in car crash in Mozambique | Sakshi
Sakshi News home page

ఘోరం.. పార్టీలోకి దూసుకెళ్లిన కారు.. 23మంది బలి

Mar 26 2018 1:36 PM | Updated on Mar 22 2019 6:17 PM

party goers killed in car crash in Mozambique - Sakshi

మొజాంబిక్‌ : సౌతర్న్‌ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకెళ్లిన కారు దాదాపు డజన్ల సంఖ్యలో ప్రాణాలు బలిగొంది. అంతా పార్టీలో లీనమై ఉన్న సందర్భంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో ఎక్కువ సంఖ్యలో మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే.. సౌతర్న్‌ ఆఫ్రికాలోని మొజాంబికాలోని మాపుటో అనే ప్రాంతంలో ఆదివారం పెద్ద సంఖ్యలో పార్టీకి హాజరయ్యారు.

ఆదివారం కావడంతో సరదాగా గడుపుతున్నారు. అదే సమయంలో వాయువేగంతో దూసుకొచ్చిన కారు కాస్త సరాసరి పార్టీలో ఉన్న జనాలపైకి వెళ్లింది.. దీంతో 23మంది అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం కారును ఆపాలని ఆదేశాలు ఇచ్చానా ఆ డ్రైవర్‌ నిర్లక్ష్యం చేశాడని తెలిసింది. పాద చారుల వంతెనపక్కనే పార్టీ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, అయితే, ఉద్దేశపూర్వకంగా చేసినా దాడి అయుంటుందా? ఉగ్రవాదా కోణాలు ఉన్నాయా అని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement