ద్వైపాక్షిక విశ్వాసానికి దెబ్బ: పాక్‌

Pakistan PM Shahid Khaqan Abbasi Summons Security Meet Over Donald Trump's Tweet - Sakshi

ఇస్లామాబాద్‌: ఉగ్రవాదంపై పోరులో ఆర్థిక సాయం పొంది మోసం చేసిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ఆరోపణలపై పాకిస్తాన్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని దెబ్బతిస్తాయని పేర్కొంది. పాకిస్తాన్‌ ప్రధాని షాహిద్‌ అబ్బాసీ నేతృత్వంలో మంగళవారం జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశమైంది.

ఈ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్, హోం మంత్రి అశాన్‌ ఇక్బాల్, రక్షణ మంత్రి ఖుర్రమ్‌ ఖాన్, త్రివిధ దళాల చీఫ్‌లు హాజరయ్యారు. ట్రంప్‌ ఆరోపణలు పూర్తి అసంబద్ధంగా, వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆ తరువాత వెలువడిన ప్రకటనలో మండలి పేర్కొంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top