విమానంలో అసభ్య ప్రవర్తన.. వ్యక్తి అరెస్టు | pak origin britisher arrested for misbehaving with stewardess onboard | Sakshi
Sakshi News home page

విమానంలో అసభ్య ప్రవర్తన.. వ్యక్తి అరెస్టు

Apr 13 2017 7:13 PM | Updated on Mar 23 2019 8:28 PM

విమానంలో అసభ్య ప్రవర్తన.. వ్యక్తి అరెస్టు - Sakshi

విమానంలో అసభ్య ప్రవర్తన.. వ్యక్తి అరెస్టు

విమానంలో ఉండగా ఓ మహిళా స్టివార్డుతో అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను తిట్టినందుకు పాకిస్తానీ సంతతికి చెందిన బ్రిటిష్‌ పౌరుడిని యూకే పోలీసులు అరెస్టు చేశారు.

విమానంలో ఉండగా ఓ మహిళా స్టివార్డుతో అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను తిట్టినందుకు పాకిస్తానీ సంతతికి చెందిన బ్రిటిష్‌ పౌరుడిని యూకే పోలీసులు అరెస్టు చేశారు. ఇస్లామాబాద్‌ నుంచి బర్మింగ్‌హామ్‌ వెళ్తున్న పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం పీకే-791లో పాకిస్తానీయులైన ఐదుగురు కలిసి ప్రయాణిస్తున్నారు. ప్రయాణ సమయంలో ఉండగా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి లావెటరీలో సిగరెట్లు కాలుస్తుండటాన్ని సిబ్బంది గమనించారు. విమాన ప్రయాణ నిబంధనలకు అది బద్ధ వ్యతిరేకం.

ఇలా చేయకూడదని ఒక మహిళా స్టివార్డు వాళ్లకు చెప్పగా, వాళ్లు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారని పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ వర్గాలు తెలిపాయి. అందులోనూ వాళ్లలో ఒక వ్యక్తి ఆమెను దారుణంగా తిట్టాడని ఆరోపించారు. దాంతో ఈ విషయాన్ని ఆమె పైలట్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో బర్మింగ్‌హామ్‌లో విమానం దిగడానికి ముందే ఆయన అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురు ప్రయాణికులను విమానం నుంచి దించేసి, వారిలో బాగా అతి చేసిన ఒక వ్యక్తిని మాత్రం పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement