మా విమానాలు ఎప్పటికీ కూలిపోవు! | 'Our Planes Never Get Lost,' AirAsia Had Claimed in April | Sakshi
Sakshi News home page

మా విమానాలు ఎప్పటికీ కూలిపోవు!

Dec 30 2014 1:27 PM | Updated on Oct 2 2018 7:37 PM

మా విమానాలు ఎప్పటికీ కూలిపోవు! - Sakshi

మా విమానాలు ఎప్పటికీ కూలిపోవు!

ఈ ఏడాది ఏప్రిల్ లో ఏయిర్ ఏషియా చేసిన ప్రకటన ఇప్పడు సర్వత్వా చర్చనీయాంశమైంది.

న్యూఢిల్లీ: మార్చి 8, 2014..239 మంది ప్రయాణికులతో బయల్దేరిన మలేషియన్ ఎమ్హెచ్ 370 విమానం అదృశ్యమైంది. ఆ విమానం అదృశ్యం అయిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఆ విమానం ఆచూకీ ఇప్పటి వరకూ తెలియకపోయినా..  ఆ మరుసటి నెల ఏప్రిల్ లో ఏయిర్ ఏషియా చేసిన ప్రకటన ఇప్పడు సర్వత్వా చర్చనీయాంశమైంది. తమ విమానాలు ఎప్పుడూ తప్పిపోవని ఏయిర్ ఏషియా గర్వంగా చెప్పుకుంది. తమ పైలెట్ ప్రయాణికుల్ని సురక్షితంగా తీసుకువస్తాడని.. తమ విమానాల్లో ప్రయాణించే వారు ఎటువంటి భయం లేదనేది ఆ ప్రకటన సారాంశం. ఆ ప్రకటన చేసి ఈ డిసెంబర్ కు సరిగ్గా ఎనిమిది నెలలు.  అయితే ఇప్పుడు అదే సంస్థకు చెందిన విమానం అదృశ్యం అయిన ఘటన విషాదం నింపింది.

ఆదివారం మలేసియా విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇండోనేసియాలోని సురబయ విమానాశ్రయం నుంచి నిన్న ఉదయం సింగపూర్‌కు బయల్దేరిన మలేసియాకు చెందిన ఎయిర్‌ఆసియా క్యూజెడ్ 8501 ఎయిర్‌బస్(ఏ320-200) విమానానికి అరగంట తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. అదృశ్యమైన విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 162 మంది ఉండగా.. వారిలో 149 మంది ప్రయాణీకులు వరకూ ఇండోనేషియా దేశస్థులు ఉన్నారు. ఇప్పటికే మలేసియాకు చెందిన మూడు విమానాలు, మూడు నౌకలు సోమవారం ఉదయం నుంచి గాలింపు, సహాయ చర్యల్లో పాల్గొని ఆ విమానం ఆచూకీ కోసం ముమ్మరం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement