ఎన్‌ఎస్‌జీపై సందిగ్ధం | NSG still unsure on India’s membership | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌జీపై సందిగ్ధం

Jun 25 2017 1:48 PM | Updated on Sep 5 2017 2:27 PM

ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వానికి భారత్‌ చేసుకున్న దరఖాస్తుపై సంస్థ ప్లీనరీ నిర్ణయం తీసుకోవడంలో విఫలమైంది.

నవంబర్‌లో మళ్లీ చర్చలు

బెర్న్‌: అణు సరఫరాదారుల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో తనకు సభ్యత్వం ఇవ్వాలని భారత్‌ చేసుకున్న దరఖాస్తుపై సంస్థ ప్లీనరీ నిర్ణయం తీసుకోవడంలో విఫలమైంది. స్విట్జర్లాండ్‌ రాజధాని బెర్న్‌లో శుక్ర, శనివారాల్లో జరిగిన ప్లీనరీలో.. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పీటీ)పై సంతకాలు చేయని దేశాలకు సభ్యత్వ అంశంపై చర్చించారు.

‘ఈ దేశాల సభ్యత్వానికి సంబంధించిన సాంకేతిక, న్యాయ, రాజకీయ అంశాలపై చర్చించారు. చర్చలు కొనసాగనున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో దీనికోసం అనధికారిక సమావేశం ఉంటుంది’ అని ఎన్‌ఎస్‌జీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌కు సభ్యత్వంపై చైనా వాదన ప్రతిబంధకంగా మారింది. ఎన్‌పీటీ అమలుకు తాము గట్టిగా మద్దతిస్తామని ప్లీనరీలో పునరుద్ఘాటించిన సభ్య దేశాలు.. ఉత్తర కొరియా అణు పరీక్షలను ఖండించాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement