బట్టలన్నీ విప్పేసి వీధుల్లో యువతి విహారం | Nightclub dancer sparks investigation after gyrating NAKED on top of moving Range Rover | Sakshi
Sakshi News home page

బట్టలన్నీ విప్పేసి వీధుల్లో యువతి విహారం

Apr 17 2016 11:20 AM | Updated on Oct 16 2018 8:34 PM

బట్టలన్నీ విప్పేసి వీధుల్లో యువతి విహారం - Sakshi

బట్టలన్నీ విప్పేసి వీధుల్లో యువతి విహారం

శాండియాగో వీధుల్లో ఓ బార్ డ్యాన్సర్ యువతి మొత్తం మహిళలకే తలవొంపులు తెచ్చే పని చేసింది. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా కారులో రోడ్డుపై విహరిస్తూ హల్ చల్ చేసింది.

శాండియాగో: శాండియాగో వీధుల్లో ఓ బార్ డ్యాన్సర్ యువతి మొత్తం మహిళలకే తలవొంపులు తెచ్చే పని చేసింది. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా కారులో రోడ్డుపై విహరిస్తూ హల్ చల్ చేసింది. ఎంతలా అంటే తన దేహం పూర్తిగా రోడ్డుపై ఉన్న వ్యక్తికి కనిపించేలా.. అది కూడా హాయ్ అంటూ అందరికీ చెప్పడమే కాకుండా టైటానికి సినిమాలో హీరోయిన్ షిప్ చివర అంచులో రెండు చేతులు చాచి విహరించినట్లుగా.. ఈ వీడియో సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయి వెలుగులోకి రావడంతో ఆమెకోసం పోలీసులు కదిలారు. డొమినికన్ రిపబ్లికన్ సాంటియాగోలో రాత్రిపూట ఈ ఘటన చోటుచేసుకుంది.

టాప్ లేని రేంజ్ రోవర్ కారులో ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగా ఆమె తన దుస్తులన్నింటిని విప్పేసి వీధుల్లో విహరించడం తమకు కనిపించిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఆమె ఎవరనే విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అయితే, గతంలో ఇక్కడే ఉన్న కాసా బ్లాంకా క్లబ్ లో డ్యాన్స్ చేసే వెనిజులాకు చెందిన యువతిగా భావిస్తున్నారు. ఆమె అలా వివస్త్రగా రోడ్లపై కేకలు వేస్తూ విహరిస్తుంటే ఇది నిజమా లేక భ్రమా అన్నట్లుగా చూడటం మిగితా కార్లలో ప్రయాణించేవారి వంతైంది. అయితే, ఆమెతో న్యూడ్ షూటింగ్ కోసమే అలా కొందరు వ్యక్తులు ఒప్పందం కుదుర్చుకొని కావాలనే వీధుల్లో విహరింప చేయిస్తూ ఎవరికీ కనిపించకుండా వీడియో షూట్ చేసి ఉంటారని చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement