అశోక్‌నగర్‌లో దారుణ హత్య | Ashok Nagar Murder Incident | Sakshi
Sakshi News home page

అశోక్‌నగర్‌లో దారుణ హత్య

Oct 15 2026 8:13 AM | Updated on Oct 15 2026 8:13 AM

Ashok Nagar Murder Incident

హైదరాబాద్‌: అశోక్‌నగర్‌లో బుధవారం రాత్రి వ్యక్తి దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. నారాయణగూడ, హిమాయత్‌నగర్‌ వెళ్లే బ్రిడ్జి సమీపంలో కిరాణా షాపు పక్కన నిద్రిస్తున్న సుభాష్‌ (40)పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. సుత్తితో ముఖం, తలపై విచక్షణారహితంగా కొట్టగా అతడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడు సుభాష్‌ వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. బీఎస్‌ఎస్‌ సెక్షన్‌ 103(1) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు కారణాలు, నిందితుల వివరాలు తెలుసుకునేందుకు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. గాలింపు చర్యలు చేపట్టామని చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.మధుబాబు తెలిపారు. ఘటనాస్థలాన్ని డీసీపీ రక్షితక్రిష్ణమూర్తి, అడిషనల్‌ డీసీపీ జోగుల నర్సయ్య, ఏసీపీ రణధీర్‌రెడ్డి, క్లూస్‌ బృందం పర్యేవేక్షించారు.    

ఇదీ చదవండి: HYD: మటన్‌ బిర్యానీలో మనిషి దంతం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement