హైదరాబాద్: ఓవైపు నగరంలోని రెస్టారెంట్లు, హోటళ్లపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) అధికారులు విస్తృతంగా దాడులు చేస్తూ, చర్యలు తీసుకుంటుండగా మరోవైపు ఓ రెస్టారెంట్లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచి్చంది. బాధితుడి వివరాల మేరకు.. చందానగర్‌కి చెందిన శ్యామ్‌ప్రసాద్ తన స్నేహితులతో కలిసి మాదాపూర్‌లోని ది జాయింట్ ఆల్ మండీ రెస్టారెంట్‌కు వెళ్లారు.
మటన్ బిర్యానీ సగం తిన్నాక ఆహారంలో ఏదో గట్టిగా తగిలింది. దీంతో తీసి చూడగా మనిషి దంతం కనిపించింది. ఇదేంటని రెస్టారెంట్ యజమానిని అడగ్గా, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. శ్యామ్‌ప్రసాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రెస్టారెంట్లో మాదాపూర్ సర్కిల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నిహారిక తనిఖీలు చేపట్టారు. మనిషి కృత్రిమ పన్ను క్యాప్‌గా అనుమానిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి: అశోక్‌నగర్‌లో దారుణ హత్య


