ట్రంప్ తాతను వెళ్లగొట్టారు! | News about trump | Sakshi
Sakshi News home page

ట్రంప్ తాతను వెళ్లగొట్టారు!

Nov 25 2016 1:44 AM | Updated on Aug 25 2018 7:50 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించి కొత్త విషయం వెలుగుచూసింది.

బెర్లిన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించి కొత్త విషయం వెలుగుచూసింది. 1900 సంవత్సరంలో నిర్బంధ సైనిక సేవ చేసేందుకు నిరాకరించారన్న కారణంతో ట్రంప్ తాత ఫ్రెడ్రిక్‌ను జర్మనీ నుంచి బహిష్కరించారని చరిత్రకారుడు రోలాండ్ పౌల్ చెప్పినట్లు సీఎన్‌ఎన్ తెలిపింది. ‘అమెరికా పౌరసత్వం తీసుకున్న ఫ్రెడ్రిక్‌కు తిరిగి జర్మనీ పౌరసత్వం ఇచ్చేది లేదని, 8 వారాల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని, లేదంటే బహిష్కరిస్తామని 1905 నాటి స్థానిక కౌన్సిల్ జారీ చేసిన లెటర్‌లో పేర్కొంది’ అని పౌల్ చెప్పారంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement