అట్టహాసంగా కొత్త సంవత్సర వేడుకలు | New Zealand Welcomes New Year With Fireworks | Sakshi
Sakshi News home page

Dec 31 2018 5:24 PM | Updated on Dec 31 2018 6:29 PM

New Zealand Welcomes New Year With Fireworks - Sakshi

న్యూజిలాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అంగరంగ వైభవంగా జరిగే కొత్త సంవత్సర వేడుకలను వీక్షించేందుకు ప్రపంచం నలు మూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి తరలివచ్చారు. ఆక్లాండ్‌లో బాణాసంచా కాంతులు మిరుమిట్లు గొల్పాయి. రంగు రంగుల కాంతులను వెదజల్లుతూ బాణాసంచా కాల్పులు పర్యాటకులకు కనువిందు చేశాయి. సంగీత హోరు, ఆనందోత్సాహాల నడుమ 2019 సంవత్సరానికి స్వాగతం పలికారు. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుని ఆనందించారు.

భారీగా తరలివచ్చిన పర్యాటకులతో రెస్టారెంట్‌లు, పబ్‌లు, బార్‌లు సందడిగా మారాయి. వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో టూరిస్టులు రెట్టించిన ఉత్సాహంతో వేడుకల్లో పాల్గొన్నారు. కొత్త సంవత్సరాల వేడుకలకు న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఎప్పటిలానే భారీ ఏర్పాట్లు చేసింది. అత్యవసర సర్వీసులను, సహాయ సిబ్బందిని అందుబాటులో ఉంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement