వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పుల కలకలం | Multiple People Shot On Streets Of Washington | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పుల కలకలం

Sep 20 2019 9:16 AM | Updated on Sep 20 2019 10:36 AM

Multiple People Shot On Streets Of Washington - Sakshi

వాషింగ్టన్‌: కాల్పుల ఘటనతో అమెరికా మరోసారి ఉల్కిపడింది. ఈ సారి ఏకంగా వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పులు చోటు చేసుకోవడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వివరాలు.. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 10 గంటల సమయంలో కొలంబియా రోడు 14వ వీధిలో గుర్తు తెలియని దుండగులు విచక్షాణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement