'పాక్లో మోదీ అడుగుపెడుతున్నారు' | Modi to visit Pakistan next year | Sakshi
Sakshi News home page

'పాక్లో మోదీ అడుగుపెడుతున్నారు'

Dec 9 2015 4:02 PM | Updated on Aug 15 2018 6:34 PM

'పాక్లో మోదీ అడుగుపెడుతున్నారు' - Sakshi

'పాక్లో మోదీ అడుగుపెడుతున్నారు'

దాయాది దేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ అడుగుపెట్టనున్నారు. వచ్చే ఏడాది పాకిస్థాన్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు.

ఇస్లామాబాద్: దాయాది దేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ అడుగుపెట్టనున్నారు. వచ్చే ఏడాది పాకిస్థాన్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ఈ విషయం భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. వచ్చే ఏడాది పాకిస్థాన్ లో దక్షిణాసియా దేశాల శిఖరాగ్ర సదస్సు(సార్క్) జరగనుందని దీనికి మోదీ హాజరవుతారని ఆమె తెలిపింది. ఇదే జరిగితే 2004 తర్వాత భారత్ నుంచి పాకిస్థాన్ను సందర్శించనున్న తొలి ప్రధాని నరేంద్రమోదీ అవుతారు. అంతకుముందు 2004లో అటల్ బీహారీ వాజపేయి పాక్ ను ఇదే సార్క్ సదస్సు పేరిట సందర్శించారు. మోదీ పర్యటనలో ఆయనతోపాటు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఉంటారు.

ఆసియా దేశాల ప్రాంతీయ సదస్సు 'హార్ట్ ఆఫ్ ఆసియా' కారక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సుష్మాస్వరాజ్ ఇస్లామాబాద్‌  వెళ్లిన విషయం తెలిసిందే. అదే రోజు కార్యక్రమం కూడా ప్రారంభమైంది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ 5వ సదస్సులో 14 సభ్య దేశాలు, 17 మిత్రదేశాలు, 12 అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement