breaking news
heart of asia
-
‘ఉగ్ర’సాయంపై ఉక్కుపాదం
హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సులో ప్రధాని మోదీ పిలుపు - మాపై పాక్ అప్రకటిత యుద్ధం: ధ్వజమెత్తిన అఫ్గాన్ ప్రధాని ఘనీ - నిందలేయటం సులభమే: పాక్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ - సదస్సు ముగింపు సందర్భంగా డిక్లరేషన్ విడుదల అమృత్సర్: హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు వేదికగా పాక్, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రధాని మోదీ, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రా ఫ్ ఘనీ నిప్పులు చెరిగారు. పాక్ మద్దతుతో ఉగ్రవాదం పెచ్చుమీరటం వల్ల ఆసియా ప్రాంత భద్రత ప్రమాదంలో పడిందని మోదీ అన్నారు. పాక్ పేరును ప్రస్తావించకుండానే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివారం జరిగిన సద స్సు ముగింపు సభలో పిలుపునిచ్చారు. అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొల్పేందుకు ఆ దేశం చేస్తున్న ఒంటరి ప్రయత్నాలు సరిపోవని అందరూ మద్దతుగా నిలవాలన్నారు. కాగా, తమపై పాక్ అప్రకటిత యుద్ధం చేస్తోందని.. దీన్ని వెంటనే ఆపేయాలని అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దుయ్యబట్టారు. మరోవైపు, భారత్, అఫ్గాన్ వ్యాఖ్యలను పాక్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఖండించా రు. ప్రపంచ శాంతికి విఘాతంగా నిలుస్తున్న ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాల్సిన అవసరం ఉందని సదస్సు తీర్మానించింది. హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సులో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ సంస్థల పేర్లు (ఉగ్ర సంస్థలుగా) పేర్కొనటం ఇదే తొలిసారి. కఠినంగా వ్యవహరించాలి: మోదీ ‘ఉగ్రవాదానికి మద్దతిస్తూ, ఉగ్రవాదులకు శిక్షణ, రక్షణ, ఆర్థికసాయం చేస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదం కారణంగానే అఫ్గాన్‌లో శాంతి, స్థిరత్వం ప్రమాదంలో పడింది’అని ప్రధాని మోదీ అన్నారు. రక్తపాతం సృష్టిస్తూ, భయాందోళనకు కారణమవుతున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌పై అంతర్జాతీయ సమాజం సంయుక్తంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్ని నొక్కిచెప్పారు. ‘శాంతికి కేంద్రంగా అఫ్గాన్‌ను నిర్మించటంలో మనమంతా పునరంకితమవుదాం. శాంతి నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. అప్పుడే ప్రజాస్వామ్యం, బహుళత్వం విజయం సాధించినట్లు’ అని అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయటం మనం తక్షణం చేయాల్సిన అతిపెద్ద పని అన్నారు. పాక్‌ది అప్రకటిత యుద్ధం: అష్రాఫ్ ఘనీ అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ.. పాకిస్తాన్‌పై నేరుగా విమర్శలు చేశారు. 2014 శీతాకాలం నుంచి పాక్ తమపై అప్రకటిత యుద్ధం చేస్తోందన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాకిస్తాన్ కొంతకాలంగా దాడుల తీవ్రతను పెంచిందన్న ఘనీ.. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అంతర్జాతీయ నిధిని ఏర్పాటుచేయాలన్నారు. ఉగ్రవాదంపై ప్రపంచానికి వాస్తవాలు తెలియాలన్నారు. అఫ్గాన్‌కు అదనంగా కోటి డాలర్ల సాయం చేసేందుకు ముందుకొచ్చిన భారత్‌కు ఘనీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదులంతా ఒక్కటే: జైట్లీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తరపున ఈ సదస్సులో పాల్గొన్న ఆర్థిక జైట్లీ.. ఉగ్రవాదంపై సంయుక్త పోరు చేయాల్సిందేనన్నారు. తాలిబాన్, హక్కానీ నెట్వర్క్, అల్కారుుదా, దారుుష్ (ఐసిస్), లష్కరే తోరుుబా, జైషే మొహమ్మద్ తదితర సంస్థలు భయోత్పా తానికి అడ్డుకట్టవేయాలన్నారు. అఫ్గాన్ పరిస్థితి ఆందోళన కరం: అజీజ్ ఉగ్రవాదం విషయంలో భారత్, అఫ్గాన్ విమర్శలపై పాక్ విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదం విషయంలో ఒక దేశంపై నిందలేయటం సులభమేనన్నారు. ‘హింస, ఉగ్రవాదం కారణంగానే అఫ్గాన్‌లో జనాలు చనిపోతున్నారు. దీన్ని పరిష్కరించేందుకు ముందడుగేయాలి. ఒక దేశంపై నిందలేయటం సులభమే. పీవోకేలో దాడుల నేపథ్యంలోనూ నేను ఈ సమావేశానికి రావటం.. అఫ్గనిస్తాన్తోపాటు ఆసియాలో శాంతి నెలకొల్పడంలో పాకిస్తాన్ చిత్తశుద్ధికి నిదర్శనం’అని అజీజ్ అన్నారు. నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ సదస్సు వారుుదా పడటం వల్ల ప్రాంతీయ సహకారానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందన్నారు. ప్రాంతీయ అనుసంధానత, ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)పై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు అజీజ్ వెల్లడించారు. తన ప్రసంగంలో అజీజ్ ఎక్క డా జమ్మూకశ్మీర్ ప్రస్తావన తీసుకురాకపోవటం విశేషం. కాగా, అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని అజీజ్ సందర్శించాలనుకున్నా.. భద్రతా కారణాలరీత్యా భారత్ అభ్యంతరం తెలిపింది. అంతకుముందు, చైనా విదేశాంగ సహాయ మంత్రి కాంగ్ జువాన్యోతో భేటీ అయిన అజీజ్.. భారత భద్రత సలహాదారు అజిత్ దోవల్‌తోనూ కాసేపు మాట్లాడారు. హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు తీర్మానాలు ► భారత్ - ఇరాన్ - అఫ్గానిస్తాన్ మధ్య కుదిరిన త్రైపాక్షిక ఛబహార్ రవాణా ఒప్పందం కారణంగా మధ్య ఆసియాకు ప్రపంచ మార్కెట్లతో బంధం మరింత బలపడుతుందని తీర్మానం తెలిపింది. ► ‘ఈ ప్రాంతంలోని ఉగ్రవాద సురక్షిత స్థావరాలను నిర్మూలించాలి. వారికందే ఆర్థిక, వ్యూహాత్మక, ఆయుధ సాయాన్ని అడ్డుకోవాలి. లష్కరే, జేషే, దాయిష్, హుక్కానీ తదితర ఉగ్ర సంస్థలు సృష్టిస్తున్న హింసపై ఆందోళన చెందుతున్నాం’ తీర్మానంలో పేర్కొంది. ► అఫ్గాన్‌లో హిజ్బే ఇస్లామీ గుల్బుద్దీన్ హెక్మత్యార్ సంస్థతో.. ప్రభుత్వం జరి పిన శాంతి చర్చలపై హర్షం వ్యకమైంది. ► చైనా-అఫ్గన్లను కలుపుతూ నిర్మిస్తున్న సిల్క్ రోడ్ ఎకనమిక్ బెల్ట్ ఒప్పందాన్ని సమావేశంలో స్వాగతించారు. ► అఫ్గన్ శరణార్థులు తిరిగి వస్తుండటంతో ఎదురవుతున్న సమస్యలతో అంతర్జాతీ య సాయానికి పిలుపునిచ్చారు. ► ఆసియా దేశాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టుల అమలుపై హర్షం. ► అఫ్గనిస్తాన్‌లో ఉత్పత్తవుతున్న నల్ల మందు, మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలని నిర్ణయం -
‘30 ఉగ్రవాద సంస్థలు ఒక్కటయ్యే కుట్ర’
-
‘30 ఉగ్రవాద సంస్థలు ఒక్కటయ్యే కుట్ర’
అమృత్సర్: భారత్ తమకు చేసే సహాయం చరిత్రలో నిలిచిపోతుందని అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అన్నారు. తమ దేశ ప్రజలకు 120కోట్ల భారతీయులు అండగా ఉంటారని మోదీ చెప్పడం సంతోషాన్నిచ్చిందని ఆయన అన్నారు. భారత్ తమకు ముఖ్యమైన దేశమని, ఇరు దేశాల మధ్య ఎప్పటికీ చక్కటి సంబంధాలు ఉంటాయని ఆయన అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై దృష్టి సారించాల్సి ఉందని, అందుకోసం తాము పెద్ద మొత్తంలో వ్యయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తమకు 500 మిలియన్ డాలర్ల సహాయం చేస్తామని పాక్ వాగ్దానం చేసిందని, ఈ డబ్బంతా ఉగ్రవాదాన్ని పెకలించడానికే తాము ఉపయోగిస్తామని తెలిపారు. దాదాపు 30 ఉగ్రవాద సంస్థలు తమ దేశంలో అతిపెద్ద ఉగ్రవాద స్థావరాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తున్నాయని, ఇదే జరిగితే మొత్తం ఆసియాకే ప్రమాదం అని, ఆ పరిస్థితి రానివ్వబోమని అన్నారు. గత ఏడాది ఉగ్రవాదుల భారిన పడి పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరిగిందని, తాము అంత నష్టాన్ని అస్సలు ఊహించలేదని అన్నారు. భారత్, అప్ఘనిస్థాన్, ఇరాన్ దేశాలకు చబహార్ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదని ఘనీ గుర్తు చేశారు. -
ఉగ్రవాదంపై మోదీ మళ్లీ కన్నెర్ర
అమృత్సర్: ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి కన్నెర్ర చేశారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాలని అన్నారు. పొరుగు దేశాల నుంచి వచ్చే ప్రమాదాల నుంచి అఫ్ఘనిస్థాన్‌కు రక్షణ కల్పించే విషయంలో అక్కడి ప్రజల భద్రతకు భరోసా ఇచ్చే విషయంలో తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు. అఫ్ఘనిస్థాన్‌లో శాంతి స్థాపనే లక్ష్యంగా ఈరోజు సమావేశమైనట్లు ఆయన చెప్పారు. అప్ఘన్ లో శాంతికి తాము మద్దతిస్తామని చెప్పడం మాత్రమే కాకుండా అది తీర్మానం రూపంలో ఉండాలని అన్నారు. ఆదివారం ప్రారంభమైన ఆరవ హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సులో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ఆసియా ప్రాంతంలోని భద్రతా పరమైన అంశాలపై ఆయన మాట్లాడారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అందరం కలిసి పోరాడాలని సదస్సుకు వచ్చిన వారందరికీ సూచించారు. ఉగ్రవాద నెట్ వర్క్‌ను కూకటి వేళ్లతో పెకలించడం ద్వారా మారణ హోమాన్ని, భయం వ్యాప్తిని నిరోధించిన వారిమవుతామని అన్నారు. అప్ఘనిస్థాన్‌లోని పెచ్చు మీరుతున్న ఉగ్రవాదంపై ఇంకా మౌనంగా ఉంటే అది ఉగ్రవాద నాయకులకు, దాన్ని ప్రోత్సహించేవారికి మరింత బలాన్ని ఇచ్చినట్లవుతుందని అన్నారు. అప్ఘనిస్థాన్‌తో ఇరుగుపొరుగు దేశాలు బలమైన, సానుకూలమైన సంబంధాలు ఏర్పరుచుంటే మొత్తం ఆసియా ప్రాంతాలకు బాగుంటుందని అన్నారు. అప్ఘన్ సోదరులకు, సోదరీ మనులకు అండగా నిలిచే విషయంలో తాము ఇప్పటికే ముందే ఉంటామని మరోసారి స్పష్టం చేశారు. అప్ఘనిస్థాన్‌కు భారతదేశం నుంచి అందే సహాయం ఎప్పటికీ అందుతుందని, అది మరింత రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఒక్క ఉగ్రవాద మూకలపైనే కాకుండా ఉగ్రవాదానికి ఊతమందించేవారిని, ఆర్థిక సహాయం చేసేవారికి వ్యతిరేకంగా కూడా కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన అప్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో సమావేశం అయ్యారు. భద్రత, వాణిజ్య పరమైన అంశాలే ఎజెండాగా వారు మాట్లాడారు. -
ఉగ్రవాదంపై మోదీ మళ్లీ కన్నెర్ర
-
మాటలు కలిపిన మోదీ, అజీజ్
అమృత్సర్: ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సులో పాల్గొనేందుకు శనివారం భారత్ చేరుకున్న పాకిస్తాన్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్.. ప్రధాని మోదీ, అఫ్గన్ అధ్యక్షుడు ఘనీ, 30 మంది ఇతర దేశాల ప్రతినిధులతో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ, అజీజ్ పలకరించుకున్నారు. సదస్సు సందర్భంగా భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. గతేడాది ఇస్లామాబాద్‌లో జరిగిన హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సులో ఇరు దేశాలు చర్చలు జరిపాయి. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం విసృ్తత ద్వైపాక్షిక భేటీ నిర్వహించాలని ఆ సమయంలో నిర్ణరుుంచాయి. అయితే పఠాన్‌కోట్ , ఉడీ దాడులు, సర్జికల్ దాడుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ సదస్సులో పాక్‌ను భారత్ దౌత్యపరంగా ఒంటరి చేయడానికి ప్రయత్నించొచ్చు. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ధిష్ట చర్యలు చేపట్టేలా ఇతర దేశాల మద్దతు కూడగట్టొచ్చు. పాక్ భూభాగం నుంచి ఉగ్ర ముప్పు ఎదుర్కొంటున్న అఫ్గనిస్తాన్ ఇతర దేశాలు కట్టుబడి ఉండేలా ప్రాంతీయ ఉగ్ర వ్యతిరేక వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నించవచ్చు. -
‘హార్ట్ ఆఫ్ ఆసియా’కు హాజరవుతాం: పాక్
ఇస్లామాబాద్: ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్‌లో జరగనున్న హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సుకు హాజరు కావాలని పాకిస్తాన్ నిర్ణయించింది. అఫ్గానిస్తాన్ పరిస్థితులపై చర్చించేందుకు డిసెంబర్ 4న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈ భేటీ జరగనుంది. ఆసియా ఖండంలోని 14 సభ్యదేశాలు పాల్గొంటాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు తోడు పాక్‌లో జరగాల్సిన సార్క్ సమావేశాలను భారత్ బహిష్కరించడం తెలిసిందే. -
నేడు భారత్, పాక్ కార్యదర్శుల భేటీ
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చలకు మరో అడుగు ముందుకు పడింది. అనుకోకుండా ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల భేటీ ఖరారైంది. ఢిల్లీలో జరిగే ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ ప్రాంతీయ భేటీలో పాల్గొనేందుకు పాక్ విదేశాంగ కార్యదర్శి అజీజ్ అహ్మద్ చౌదరి మంగళవారం భారత్‌కు రానున్నారు. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్. జైశంకర్‌తో భేటీ కానున్నారు. -
'పాక్‌లో మోదీ అడుగుపెడుతున్నారు'
ఇస్లామాబాద్: దాయాది దేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ అడుగుపెట్టనున్నారు. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ఈ విషయం భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. వచ్చే ఏడాది పాకిస్థాన్ లో దక్షిణాసియా దేశాల శిఖరాగ్ర సదస్సు(సార్క్) జరగనుందని దీనికి మోదీ హాజరవుతారని ఆమె తెలిపింది. ఇదే జరిగితే 2004 తర్వాత భారత్ నుంచి పాకిస్థాన్‌ను సందర్శించనున్న తొలి ప్రధాని నరేంద్రమోదీ అవుతారు. అంతకుముందు 2004లో అటల్ బీహారీ వాజపేయి పాక్ ను ఇదే సార్క్ సదస్సు పేరిట సందర్శించారు. మోదీ పర్యటనలో ఆయనతోపాటు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఉంటారు. ఆసియా దేశాల ప్రాంతీయ సదస్సు 'హార్ట్ ఆఫ్ ఆసియా' కారక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సుష్మాస్వరాజ్ ఇస్లామాబాద్ వెళ్లిన విషయం తెలిసిందే. అదే రోజు కార్యక్రమం కూడా ప్రారంభమైంది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ 5వ సదస్సులో 14 సభ్య దేశాలు, 17 మిత్రదేశాలు, 12 అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వం వహిస్తున్నారు. -
ఇండో-పాక్ సిరీస్ పై నేడే ప్రకటన!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన సలహాదారు సర్తాజ్ అజీజ్ తో భేటీ కానున్నారు. ఇరు దేశాల సంబంధాలు పెంపొందించే విషయమై ప్రధానంగా వీరు చర్చించనున్నారు. అఫ్గనిస్థాన్ అంశంపై ఐదో మినిస్ట్రియల్ సదస్సు 'హార్ట్ ఆఫ్ ఆసియా'లో పాల్గొనేందుకు సుష్మా రెండు రోజుల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇరుదేశాల దౌత్య సంబంధాలు మరింత పెంపొందించేందుకే కృషి జరుగుతున్నదని, అందులోభాగంగానే పాకిస్థాన్ ప్రధాని షరీఫ్, ఆయన సలహాదారు సర్తాజ్ అజీజ్ తో తాను సమావేశమై దౌత్య విషయాలు చర్చించనున్నట్టు సుష్మా తెలిపారు. మంగళవారం రాత్రి సర్తాజ్ అజీజ్ విదేశీ ప్రతినిధులకు ఇచ్చిన విందులో సుష్మ కూడా పాల్గొన్నారు. అఫ్గన్ అంశంతోపాటు ఆసియాలో భద్రతకు పొంచి ఉన్న ముప్పు, ప్రాంతీయ అనుసంధానంపై చర్చించేందుకు 'హార్ట్ ఆఫ్ ఆసియా' ఐదో సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సులో 14 ఆసియా దేశాలు, 17 మద్దతు దేశాలు, 12 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. సుష్మ పాకిస్థాన్ పర్యటన సందర్భంగా బుధవారమే భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ గురించి ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తున్నది. తటస్థ వేదికల్లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోవైపు 26/11 ముంబై దాడుల ఘటనపై లాహోర్ కోర్టులో బుధవారం విచారణ జరుగనుంది. -
పాక్‌తో సత్సంబంధాల దిశగా!