ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి కన్నెర్ర చేశారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాలని అన్నారు. పొరుగు దేశాల నుంచి వచ్చే ప్రమాదాల నుంచి అఫ్ఘనిస్థాన్‌కు రక్షణ కల్పించే విషయంలో అక్కడి ప్రజల భద్రతకు భరోసా ఇచ్చే విషయంలో తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు. అఫ్ఘనిస్థాన్‌లో శాంతి స్థాపనే లక్ష్యంగా ఈరోజు సమావేశమైనట్లు ఆయన చెప్పారు. అప్ఘన్ లో శాంతికి తాము మద్దతిస్తామని చెప్పడం మాత్రమే కాకుండా అది తీర్మానం రూపంలో ఉండాలని అన్నారు.