ఆ అమ్మాయి చనిపోయింది

Missing Franco Irish Teen Naked Body Found in Malaysia Forest - Sakshi

కౌలాలంపూర్‌: మలేసియాలో అదృశ్యమైన ఫ్రాంకో-ఐరిష్‌ బాలిక​ నోరా కొయిరిన్‌(15) మృతి చెందినట్టు గుర్తించారు. నెగ్రిసెంబిలాన్‌ రాష్ట్రంలోని ‘డుసన్‌ ఫారెస్ట్‌ ఎకోరిసార్ట్‌’ నుంచి ఈ నెల 4న ఆమె అదృశ్యమైంది. చిన్నారి కోసం మలేసియా పోలీసులు అడవంతా జల్లెడ పట్టారు. రిస్టార్‌కు రెండున్నర కిలోమీటర్ల దూరంలో నీటి ప్రవాహంలో రాయిపై నగ్నంగా పడివున్న బాలి​క మృతదేహాన్ని కనుగొన్నట్టు మలేసియా జాతీయ పోలీసు విభాగం డిప్యూటీ చీఫ్‌ మజ్లాన్‌ మన్సూర్‌ తెలిపారు. మృతదేహాన్ని హెలికాప్టర్‌లో ఆస్పత్రి తరలించినట్టు చెప్పారు. బాలిక శరీరంపై గాయాలేమైనా ఉన్నాయా అనే దానిపై వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. చనిపోయిన బాలిక నోరా కొయిరిన్‌గా ఆమె తల్లిదండ్రులు ధ్రువీకరించారు. బాలిక మరణానికి గల కారణాలు పోస్ట్‌మార్టం తర్వాత వెల్లడయ్యే అవకాశముంది.


నోరా కొయిరిన్‌ మృతదేహాన్ని హెలికాప్టర్‌లో తరలిస్తున్న సహాయక సిబ్బంది(రాయిటర్స్‌ ఫొటో)

నోరా కొయిరిన్‌ కిడ్నాప్‌ అయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, పోలీసులు మాత్రం మిస్సింగ్‌ కేసుగానే పరిగణిస్తున్నట్టు చెబుతున్నారు. కాగా, నోరా కొయిరిన్‌ ఆచూకీ కోసం పోలీసులతో పాటు చాలా మంది వలంటీర్లు గాలించారు. తమ కుమార్తె ఆచూకీ చెప్పిన వారికి 50 వేల రింగిట్స్‌(సుమారు 8.5 లక్షలు) నజరానా ఇస్తామని నోరా కొయిరిన్‌ తల్లిదండ్రులు ప్రకటించారు. చిన్నారిని ఎవరైనా హత్య చేశారా, అడవిలోని పరిస్థితుల వల్ల ఆమె చనిపోయిందా అనేది వెల్లడి కావాల్సి ఉంది. (చదవండి: ఆ అమ్మాయి కోసం 300 మంది గాలింపు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top