కుస్తీ సాధన చేస్తూ పసివాడి హత్య | Mimicking The Undertaker's WWE move, man kills 18-month-old | Sakshi
Sakshi News home page

కుస్తీ సాధన చేస్తూ పసివాడి హత్య

May 9 2015 3:19 PM | Updated on Sep 3 2017 1:44 AM

కుస్తీ సాధన  చేస్తూ పసివాడి హత్య

కుస్తీ సాధన చేస్తూ పసివాడి హత్య

కుస్తీ సాధన చేస్తూ తన గర్ల్ ఫ్రెండ్ 18 నెలల కొడుకును నేలకేసి కొట్టి హత్యచేశాడో ప్రబుద్ధుడు. రెజ్లింగ్ వృత్తినే పరిహాసం చేసిన ఈ ఘటన పై ప్రపంచ రెజ్లింగ్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

జెర్సీషోర్: కుస్తీ సాధన చేస్తూ తన గర్ల్ ఫ్రెండ్ 18 నెలల కొడుకును నేలకేసి కొట్టి చంపేశాడో ప్రబుద్ధుడు. ఆమె ఉద్యోగానికి వెళ్తూ.. తన కొడుకును అతడి దగ్గర వదిలి వెళ్లింది. ఆ సమయంలో ఈ ఘోరం జరిగింది. రెజ్లింగ్ వృత్తినే పరిహాసం చేసిన ఈ ఘటన పై ప్రపంచ రెజ్లింగ్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

బ్రాండన్ హాఫ్మెన్ అనే 20 ఏళ్ల రెజ్లర్ కుస్తీలో ప్రముఖమైన 'ది లాస్ట్ రైడ్ (ప్రత్యర్థి ఎత్తి భుజాలపై ఎత్తుకొని..  గిరాగిరా తిప్పి బలంగా నేలకేసి కొట్టే) అనే పట్టు సాధన కోసం 18  నెలల పసిబాలుడ్ని ఎంచుకున్నాడు.  మంచంపై ఉన్నపిల్లవాణ్నిఅతి దారుణంగా  నేలకేసి కొట్టాడు. దీంతో ఆ పసివాడు మెడనరాలు విరిగి,  తలకు తీవ్రంగా గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయాడు.  

పోలీసుల సమాచారం ప్రకారం సంఘటనపై హాఫ్మన్ వాస్తవాలను చెప్పలేదు. పైకి ఎగరేసి పట్టుకోలేకపోయానని మొదట చెప్పిన నిందితుడు, ఆ తర్వాత విచారణలో  అసలు విషయాన్ని  అంగీకరించాడు. గతంలో కూడా అతడు ఇలాంటి ప్రయత్నం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

హాఫ్మన్పై కేసు నమోదుచేసిన పోలీసులు కోర్టు తరలించారు.  కోర్టు అతనికి సుమారు కోటి రూపాయల  పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.దీనిపై తీవ్రం ఆగ్రహం వ్యక్తంచేసిన  ప్రపంచ కుస్తీసంఘం  కుస్తీకే మాయని మచ్చను తీసుకొచ్చిన హాఫ్ మన్ ను క్షమించేది లేదని తేల్చి చెప్పింది.  బాలుడి తల్లికి  సంతాపం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement