breaking news
world wrestling
-
బజరంగ్‌కు స్వర్ణం
రోమ్: వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీ లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల 65 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్ మంగో లియా రెజ్లర్ తుల్గా తుమర్‌పై విజయం సాధించాడు. నిర్ణీత రెండు రౌండ్ల తర్వాత ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. అయితే మంగోలియా రెజ్లర్ ఒక్కో పాయింట్ రెండుసార్లు సాధించగా... చివరి సెకన్లలో ఒకే పట్టుతో రెండు పాయింట్లు సాధించినందుకు బజరంగ్ ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు బజరంగ్ క్వార్టర్ ఫైనల్లో 7–0తో సెలిమ్ కొజాన్ (టర్కీ)పై, సెమీఫైనల్లో 6–3తో క్రిస్టో ఫర్ (అమెరికా)పై గెలిచాడు. భారత్‌కే చెందిన విశాల్ (70 కేజీలు) కాంస్యం సాధించాడు. -
కుస్తీ సాధన చేస్తూ పసివాడి హత్య
జెర్సీషోర్: కుస్తీ సాధన చేస్తూ తన గర్ల్ ఫ్రెండ్ 18 నెలల కొడుకును నేలకేసి కొట్టి చంపేశాడో ప్రబుద్ధుడు. ఆమె ఉద్యోగానికి వెళ్తూ.. తన కొడుకును అతడి దగ్గర వదిలి వెళ్లింది. ఆ సమయంలో ఈ ఘోరం జరిగింది. రెజ్లింగ్ వృత్తినే పరిహాసం చేసిన ఈ ఘటన పై ప్రపంచ రెజ్లింగ్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రాండన్ హాఫ్‌మెన్ అనే 20 ఏళ్ల రెజ్లర్ కుస్తీలో ప్రముఖమైన 'ది లాస్ట్ రైడ్ (ప్రత్యర్థి ఎత్తి భుజాలపై ఎత్తుకొని.. గిరాగిరా తిప్పి బలంగా నేలకేసి కొట్టే) అనే పట్టు సాధన కోసం 18 నెలల పసిబాలుడ్ని ఎంచుకున్నాడు. మంచంపై ఉన్నపిల్లవాణ్నిఅతి దారుణంగా నేలకేసి కొట్టాడు. దీంతో ఆ పసివాడు మెడనరాలు విరిగి, తలకు తీవ్రంగా గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల సమాచారం ప్రకారం సంఘటనపై హాఫ్మన్ వాస్తవాలను చెప్పలేదు. పైకి ఎగరేసి పట్టుకోలేకపోయానని మొదట చెప్పిన నిందితుడు, ఆ తర్వాత విచారణలో అసలు విషయాన్ని అంగీకరించాడు. గతంలో కూడా అతడు ఇలాంటి ప్రయత్నం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. హాఫ్మన్పై కేసు నమోదుచేసిన పోలీసులు కోర్టు తరలించారు. కోర్టు అతనికి సుమారు కోటి రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.దీనిపై తీవ్రం ఆగ్రహం వ్యక్తంచేసిన ప్రపంచ కుస్తీసంఘం కుస్తీకే మాయని మచ్చను తీసుకొచ్చిన హాఫ్ మన్ ను క్షమించేది లేదని తేల్చి చెప్పింది. బాలుడి తల్లికి సంతాపం తెలిపింది.