శక్తిమంతమైన వస్తువుల వల్లే విమానం కూలింది | MH17: Malaysia Airlines plane 'split into pieces during flight' | Sakshi
Sakshi News home page

శక్తిమంతమైన వస్తువుల వల్లే విమానం కూలింది

Sep 10 2014 1:51 AM | Updated on Sep 2 2017 1:07 PM

ఉక్రెయిన్‌లో జూలై 17న 298 మందితో ప్రయాణిస్తున్న మలేసియా విమానం శక్తిమంతమైన వస్తువులు ఢీకొట్టడం వల్లే నేలకూలిందని డచ్ నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది.

మలేసియా విమానం కూల్చివేతపై నిపుణుల నివేదిక
 ద హేగ్(నెదర్లాండ్స్): ఉక్రెయిన్‌లో జూలై 17న 298 మందితో ప్రయాణిస్తున్న మలేసియా విమానం శక్తిమంతమైన వస్తువులు ఢీకొట్టడం వల్లే నేలకూలిందని డచ్ నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ఆ విమానాన్ని క్షిపణితోనే కూల్చివేశారన్న వాదనకు మంగళవారం డచ్ భద్రతా మండలి సమర్పించిన ఈ నివేదికతో మరింత బలం చేకూరినట్లైంది. విమానం బ్లాక్‌బాక్సుల సమాచారం, ఫొటోలు, వీడియోల ఆధారంగా ప్రాథమికంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు కమిటీ తెలిపింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. విమానాన్ని బయటి నుంచి బలమైన వస్తువులు ఢీకొట్టడం వల్లే కూలినట్లు తెలుస్తోందని, తుది నివేదికను 2015, జూలై నాటికి అందజేస్తామని కమిటీ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement