‘అమ్మ’ సమయస్ఫూర్తికి సలామ్‌.. వైరల్‌

Mexican Mother Cover Her Face Whole Breastfeeding Photo Viral - Sakshi

బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుందంటారు. ఆ బిడ్డ ఆకలితో ఏడిస్తే తల్లి పేగు కదులుతుంది. ఆ సమయంలో మరో విషయం ఆలోచించకుండా మాతృమూర్తులు తన బిడ్డకు చనుపాలు ఇస్తారు. కానీ నేటికీ పలానా చోట ఉన్నప్పుడు పాలు ఇవ్వకూడదు, పలానా సమయంలో చనుపాలు అలా ఎలా ఇస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఓ మెక్సికన్‌ మదర్‌ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పరిస్థితిని చాలా హుందాగా ఎదుర్కొన్నారంటూ ఆమెకు మద్దతు లభిస్తోంది.

మెలానీ డడ్లీ అనే మహిళకు సంతానం నాలుగు నెలల బాబు ఉన్నాడు. ఆమె మెక్సికోలోని కాబో శాన్‌లుకాస్‌లో రెస్టారెంట్‌కు ఇటీవల కుటుంబంతో పాటు  వెళ్లారు. అయితే అదే సమయంలో ఆమె బిడ్డ ఆకలితో ఏడుపు మొదలుపెట్టాడు. ఆ కన్నతల్లి వెంటనే తన బిడ్డకు పాలు ఇస్తూ మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాధిస్తున్నారు. రెస్టారెంట్‌ ముందు నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి కవర్‌ చేసుకోండి అని ఆమెకు సూచించాడు. దీంతో తన ఉద్దేశాన్ని స్పష్టం చేయాలనుకున్న మెలానీ వెంటనే తన చీర కొంగుతో తల, ముఖం మొత్తం కప్పేసుకుని ఆ పాదచారికి బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను మెలానీ ఫ్యామిలీ ఫ్రెండ్‌ కారల్‌ లాక్‌వుడ్‌ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. (ఆ ఫొటోలో అశ్లీలత లేదు: హైకోర్టు)

ఆమె ఫ్యామిలీ నాకు సన్నిహితులే. కానీ నేను ఆమెను ఎప్పుడూ చూడలేదు. అయితేనేం ఆమె చేసిన పని ప్రశంసనీయం. మెలానీ చాలా మంచిపని చేశారు. ఆమె అనుమతిని కోరుతూ లాక్‌వుడ్‌ తన ఫేస్‌బుక్‌లో ఈ వివరాలను పోస్ట్‌ చేయగా విశేష స్పందన వస్తోంది. సమయస్ఫూర్తితో ఆమె తల, ముఖాన్ని కవర్‌ చేసుకుని తనకు సూచనలిచ్చిన వ్యక్తికి బదులిచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

మెలానీ మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో.. తమ పిల్లలకు బహిరంగ స్థలాల్లో చనుపాలు ఇవ్వడం ఒకటని చెప్పారు. కుటుంబంతో పాటు ఉన్న తనకు శరీరాన్ని కవర్‌ చేసుకోవాలని ఓ వ్యక్తి సూచించడం విచిత్రంగా అనిపించిందన్నారు. అందుకే తెలివిగా నా ముఖాన్ని కవర్ చేసుకున్నానని వివరించారు. కాగా, ఇటీవల అమెరికాకు చెందిన మారా మార్టిన్‌ అనే మోడల్‌ మియామీలో ర్యాంప్‌ వాక్‌ చేస్తుండగా ఆమె ఐదు నెలల చిన్నారి ఏడుస్తున్నాడని.. బిడ్డకు పాలిస్తూనే ఈవెంట్‌లో పాల్గొని తల్లిప్రేమను మించింది మరొకటి లేదని నిరూపించారు. 

(మాతృత్వానికే అంబాసిడర్‌గా నిలిచిన మోడల్‌)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top