లండన్‌లో భారీ అగ్నిప్రమాదం | Massive Fire In London Market | Sakshi
Sakshi News home page

లండన్‌లో భారీ అగ్నిప్రమాదం

Jul 10 2017 10:20 AM | Updated on Sep 5 2018 9:47 PM

లండన్‌లో భారీ అగ్నిప్రమాదం - Sakshi

లండన్‌లో భారీ అగ్నిప్రమాదం

లండన్‌లోని క్యామ్‌డెన్‌ లాక్‌ మార్కెట్‌లో ఆదివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

లండన్‌:
లండన్‌లోని క్యామ్‌డెన్‌ లాక్‌ మార్కెట్‌లో ఆదివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పది అగ్నిమాపక శకటాలతో మంటలు అదుపు చేశారు. క్యామ్‌డెన్‌ మార్కెట్‌ ఉత్తర లండన్‌లోనే ప్రముఖ పర్యాటక స్థలం. ఓ భవనంలోని మూడు అంతస్థుల్లో మంటలు వ్యాపించినట్లు, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

మంటలను అదుపు చేయడంలో ఆలస్యమైతే పక్కనున్న రెస్టారెంట్లకు కూడా మంటలు వ్యాపించేవన్నారు. కాగా, వెస్ట్‌ లండన్‌లోని గ్రెన్‌ఫెల్‌ టవర్‌లో గత నెలలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి విధితమే.

Advertisement
 
Advertisement
Advertisement