breaking news
london market
-
చమురు భగభగ..
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా గల్ఫ్ ఇంధన క్షేత్రాలు, నిల్వలపై దాడులకు తెరతీయడంతో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 9 శాతం జంప్‌చేసి 117 డాలర్లకు చేరింది. దేశీయంగా ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ రూ. 74 పెరిగి రూ. 9,067ను తాకింది. యూఎస్ నైమెక్స్లోనూ లైట్ స్వీట్ చమురు పీపా 1.6 శాతం బలపడి 97 డాలర్లకు చేరింది. హార్మూజ్ మూసివేతకుతోడు.. ఖతార్‌లోని గ్యాస్ సౌకర్యాలు, కువైట్‌లోని చమురు రిఫైనరీలు దాడులకు గురికావడం తదితర అంశాలు ఇంధన సరఫరాలను దెబ్బతీయనున్న ఆందోళనలు ధరలను ఎగదోస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో భారత్ చమురు బాస్కెట్ 145 డాలర్లను అధిగమించనున్నట్లు వెలువడిన అంచనాలు దేశీయంగా ఇంధన రంగ దిగ్గజ షేర్లలో భారీ అమ్మకాలకు దారి చూపాయి. -
లండన్‌లో భారీ అగ్నిప్రమాదం
లండన్: లండన్‌లోని క్యామ్‌డెన్ లాక్ మార్కెట్లో ఆదివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పది అగ్నిమాపక శకటాలతో మంటలు అదుపు చేశారు. క్యామ్‌డెన్ మార్కెట్ ఉత్తర లండన్‌లోనే ప్రముఖ పర్యాటక స్థలం. ఓ భవనంలోని మూడు అంతస్థుల్లో మంటలు వ్యాపించినట్లు, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేయడంలో ఆలస్యమైతే పక్కనున్న రెస్టారెంట్లకు కూడా మంటలు వ్యాపించేవన్నారు. కాగా, వెస్ట్ లండన్‌లోని గ్రెన్‌ఫెల్ టవర్‌లో గత నెలలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి విధితమే.


