చమురు భగభగ.. | Oil Prices Hit Record Highs Amid Iran War | Sakshi
Sakshi News home page

చమురు భగభగ..

Mar 20 2026 5:44 AM | Updated on Mar 20 2026 7:58 AM

Oil Prices Hit Record Highs Amid Iran War

బ్రెంట్‌ బ్యారల్‌ 119 డాలర్లు

న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా గల్ఫ్‌ ఇంధన క్షేత్రాలు, నిల్వలపై దాడులకు తెరతీయడంతో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 9 శాతం జంప్‌చేసి 117 డాలర్లకు చేరింది. దేశీయంగా ఎంసీఎక్స్‌లో ఏప్రిల్‌ డెలివరీ కాంట్రాక్ట్‌ రూ. 74 పెరిగి రూ. 9,067ను తాకింది. యూఎస్‌ నైమెక్స్‌లోనూ లైట్‌ స్వీట్‌ చమురు పీపా 1.6 శాతం బలపడి 97 డాలర్లకు చేరింది. 

హార్మూజ్‌ మూసివేతకుతోడు.. ఖతార్‌లోని గ్యాస్‌ సౌకర్యాలు, కువైట్‌లోని చమురు రిఫైనరీలు దాడులకు గురికావడం తదితర అంశాలు ఇంధన సరఫరాలను దెబ్బతీయనున్న ఆందోళనలు ధరలను ఎగదోస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో భారత్‌ చమురు బాస్కెట్‌ 145 డాలర్లను అధిగమించనున్నట్లు వెలువడిన అంచనాలు దేశీయంగా ఇంధన రంగ దిగ్గజ షేర్లలో భారీ అమ్మకాలకు దారి చూపాయి. 

Advertisement
 
Advertisement
Advertisement