ఫిజీలో భారీ భూకంపం | Massive Earthquake In Fiji | Sakshi
Sakshi News home page

Aug 19 2018 8:00 AM | Updated on Aug 19 2018 8:27 AM

Massive Earthquake In Fiji - Sakshi

దక్షిణ పసిఫిక్‌ సముద్రంలో దీవుల సమూహమైన ఫిజీలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.2 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపంతో సునామీ వచ్చే అవకాశాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 5 గంటల 37 నిమిషాలకు భూమి కంపించడం మొదలైందని స్థానికలు చెప్పారు. ఒక్క సారిగి భూమి కంపించడం మొదలవడంలో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లలోంచి బయటకి పరుగులు తీశారు. అయితే భూకంపానికి సంబంధించి ఆస్తి, ప్రాణనష్టంపై సమాచారం తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement